పాక్‌ కెప్టెన్ బాబర్ ఆజాంకు పోలీసుల జరిమానా..ఏం చేశాడంటే?

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం తాజాగా వార్తల్లో నిలిచాడు. బాబర్‌కు పోలీసులు జరిమానా విధించారు.

By Srikanth Gundamalla  Published on  26 Sept 2023 11:09 AM IST
Babar azam, Fined,  police, pakistan cricket, captain,

పాక్‌ కెప్టెన్ బాబర్ ఆజాంకు పోలీసుల జరిమానా..ఏం చేశాడంటే?

పాకిస్థాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్ ఆజాం అందరికీ తెలిసిన వ్యక్తే. దాయాది దేశం టీమ్‌ కెప్టెన్‌ అయినా కూడా అతని ఆట తీరు చాలా బాగుంటుంది. బ్యాటింగ్‌లో బాగా రాణిస్తున్నాడు. అంతేకాదు.. పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉందనే చెప్పాలి. అయితే.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజాం తాజాగా వార్తల్లో నిలిచాడు. బాబర్‌కు పోలీసులు జరిమానా విధించారని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టైమ్స్‌ ఆఫ్‌ కరాచీ నివేదికల ప్రకారం.. అతివేగంతో కారు నడిపినందుకు బాబర్‌ ఆజాంకు పోలీసులు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ హైవేలో తన ఆడి కారును పరిమితి వేగానికి మించి నడిపినట్లు తెలుస్తోంది. దాంతో.. అతడు అత్యంత వేగంగా కారు నడపడం వల్ల బాబర్‌ను పంజాబ్‌ మోటర్‌వే పోలీసులు గమనించి వెంబడించారు. ఆ తర్వాత కారును ఆపి ఫైన్‌ విధించినట్లు సమాచారం అందుతోంది. బాబర్‌ ఆజామ్‌కు పోలీసులు ఎంత ఫైన్ విధించారనేది మాత్రం బయటకు తెలియలేదు. ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కడం బాబర్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కారుకు సరైన నెంబర్‌ ప్లేటు లేకుండానే రోడ్లపైకి వచ్చాడు. దాంతో.. అది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు.

ఇక వన్డే వరల్డ్‌ కప్-2023కి పాకిస్థాన్ టీమ్‌ సమయాత్తం అవుతోంది. పాక్‌ జట్టును ప్రకటించారు.

వరల్డ్‌కప్‌కు పాకిస్తాన్‌ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్‌), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వాస్ జూనియర

Next Story