రిషబ్ పంత్ గురించి మిచెల్ మార్ష్ ఆసక్తికర కామెంట్స్
రోడ్డు ప్రమాదంలో గాయడపడ్డ ఇండియన్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2024 4:47 PM ISTకొంతకాలం ముందు రోడ్డు ప్రమాదంలో గాయడపడ్డ ఇండియన్ యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. గత ఐపీఎల్ సీజన్ నుంచి వరుసగా రాణిస్తున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా సెంచరీతో అదరగొట్టాడు. మరోవైపు వికెట్ కీపింగ్‌లో కూడా తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు రిషబ్ పంత్. అయితే.. తాజాగా ఈ యంగ్ ఇండియన్ వికెట్ కీపర్ గురించి ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ మిచెల్ మార్ష్ కీలక కామెంట్స్ చేశాడు.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కొద్దిరోజుల్లో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మొదలుకాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ క్రీడాఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్ష్ మాట్లాడారు. ఈ సందర్భంగా రిషబ్ పంత్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రిషబ్ పంత్ మంచి ఆటగాడనీ.. చీల్చిచెండాడుతాడు అని అన్నాడు.పంత్ ఆస్ట్రేలియన్ అయితే బాగుండని నేను కోరుకుంటున్నట్లు చెప్పాడు. గత కొన్నేళ్లుగా అతడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు మిచెట్. వాటి తర్వాత అతను మరింత బలంగా తిరిగొచ్చాడనిచెప్పారు. గెలవడాన్ని ఎంతో ఇష్టపడుతాడనీ... మంచి పోటీనిస్తాడని పేర్కొన్నాడు మిచెల్ మార్ష్.
ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న మరో ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా పంత్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అతడు చాలా దూకుడుగా ఆడుతాడని పేర్కొన్నాడు. వీరి వీడియోపై పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. ఫైర్, నవ్వుతున్న ఎమోజీలతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.