ఆ బ్యూటీతో తన రిలేషన్ షిప్ ను బయట పెట్టేసిన కెఎల్ రాహుల్

Athiya Shetty and KL Rahul make their relationship public.కెఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్ గా ఎదుగుతూ

By M.S.R  Published on  6 Nov 2021 11:38 AM IST
ఆ బ్యూటీతో తన రిలేషన్ షిప్ ను బయట పెట్టేసిన కెఎల్ రాహుల్

కెఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్ గా ఎదుగుతూ వస్తున్నాడు. అతడు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, నటి అతియా శెట్టితో రిలేషన్ షిప్ లో ఉన్నాడనే వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ బయట వీరిద్దరూ తాము ప్రేమలో ఉన్నామని ఎప్పుడూ చెప్పలేదు. తాజాగా మాత్రం రాహుల్, అతియాశెట్టిలు తాము ప్రేమించుకుంటున్నామని అధికారికంగా ప్రకటించారు. ఇన్‌స్టాగ్రామ్ లో అధికారికంగా కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. అతియాశెట్టి పుట్టినరోజున రాహుల్ వారి సంబంధాన్ని ధ్రువీకరిస్తూ ప్రేమించుకున్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ లవ్ ఎమోజీతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday my ❤️ @athiyashetty" అంటూ రాహుల్ పోస్ట్ చేశాడు.

2019లో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు వ్యాపించాయి. రాహుల్ క్రికెట్ లో ఎదుగుతూ ఉండగా.. అతియాశెట్టి ఇంకా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోతోంది. 2015లో సూరజ్ పంచోలీ సరసన 'హీరో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'ముబారకన్' నటించింది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. చివరిగా నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన మోతీచూర్ చక్నాచూర్‌లో కనిపించింది.

చాలా రోజులుగా వీరిద్దరూ లవ్ లో ఉన్నా కూడా ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు. కెఎల్ రాహుల్‌తో తనకున్న రిలేషన్ గురించి అతియా కు ప్రశ్నలు ఎదురైనా కూడా ఎటువంటి సమాధానం రాలేదు. అయితే ఇటీవలి లండన్ పర్యటన కు సంబంధించి ఆ జంటకు సంబంధించిన చిత్రాలు బయటకీ వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాహుల్ బిసిసిఐకి సమర్పించిన పత్రాలలో శెట్టిని తన భాగస్వామిగా పేర్కొన్నాడు.. అదే విషయాన్ని వారికి తెలియజేశాడు.

Next Story