ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది.
By Srikanth Gundamalla Published on 25 Sep 2023 4:57 AM GMTఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంట్‌లో వరల్డ్ రికార్డును సృష్టించారు. భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు ఆసియా క్రీడల్లో మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించింది.
ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. గతంలో చైనా ఎయిర్‌రైఫిల్ టీమ్ సాధించిన 1893.3 పాయింట్ల రికార్డును భారత రైఫిల్ జట్టు అధిగమించింది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం ఉండగా.. మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.
ఎయిర్‌రైఫిల్ 10 మీటర్ల విభాగంలో టీమ్‌గా గోల్డ్ గెలిచిన రుద్రాంక్ష్, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైన్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదో స్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్‌ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం లభించింది.