ఆసియా కప్-23: రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక
అరుదైన రికార్డును శ్రీలంక తమ ఖాతాలో వేసుకుంది.
By Srikanth Gundamalla Published on 1 Sep 2023 5:29 AM GMTఆసియా కప్-23: రికార్డు క్రియేట్ చేసిన శ్రీలంక
ఆసియాకప్-2023 మొదలైంది. హోరోహోరీగా కప్ కోసం జట్లు తలబడుతున్నాయి. శ్రీలంక బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో 5 వికెట్ల తేడాతో బంగ్లాపై శ్రీలంక ఘనవిజయం సాధించింది. అయితే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యింది. 42.4 ఓవర్లలో కేవలం 164 పరుగులే చేసి ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో నజుముల్ హుసేన్ శాంటో (89) తప్ప మిగతా బ్యాటర్లు అంతా దారుణంగా విఫలం అయ్యారు.
శ్రీలంక బౌలర్లలో యువ సంచనం మతీశా పతిరణ నాలుగు వికెట్లు తీశాడు. అతడి బౌలింగ్ బంగ్లాదేశ్ బ్యాటర్లను దెబ్బతీసింది. 165 టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంక 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సమరవిక్రమ 54 పరుగులతో రాణించాడు.
ఈ మ్యాచ్ తర్వాత శ్రీలంక టీమ్ చరిత్రను క్రియేట్ చేసింది. అరుదైన రికార్డును శ్రీలంక తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టీమ్‌గా శ్రీలంక నిలిచింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను శ్రీలంక ఆలౌట్ చేసి.. ఈ ఘనతను తమ పేరిట నమోదు చేసుకుంది. వరుసగా 11 సార్లు ప్రత్యర్థి జట్టును వన్డే మ్యాచుల్లో ఆలౌట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పేరిట ఉండేది. ఈ రెండు జట్లు 10 సార్లు వరుసగా ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేశాయి. శ్రీలంక 11 సార్లు ఆలౌట్ చేసి రికార్డును బ్రేక్ చేసింది.