భారత్-పాక్‌ మ్యాచ్‌ వేళ వాతావరణశాఖ షాకింగ్ న్యూస్

భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు 90 శాతం వరణుడి ముప్పు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2023 4:09 PM IST
Asia Cup-2023, India Vs Pakistan, Weather Alert,

భారత్-పాక్‌ మ్యాచ్‌ వేళ వాతావరణశాఖ షాకింగ్ న్యూస్

క్రికెట్‌కు చాలా మంది అభిమానులు ఉంటారు. ఫార్మట్‌ ఏదైనా కొందరు టీమిండియా ఆడుతుంటే చాలు.. ఇంట్రెస్ట్‌గా చూస్తారు. ఇక అదే పోరు దాయాది దేశం పాకిస్థాన్‌తో అంటే మాత్రం.. క్రికెట్‌ అభిమానులే కాదు దేశం మొత్తం ఆసక్తి కనబరుస్తుంది. అయితే.. దాదాపు ఏడాది తర్వాత పాకిస్థాన్‌తో టీమిండియా ఢీకొట్టనుంది. ఆసియా కప్-2023 కొనసాగుతున్న విషయం తెలిసిందే. పల్లెకెలె వేదికగా సెప్టెంబర్‌ 2న ఈ మ్యాచ్‌ జరగనుంది. కాగా.. వన్డేల్లో అయితే నాలుగేళ్ల తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ టీమ్‌లు తలబడుతున్నాయి. 2019 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ వేదికగా ఈ రెండు టీమ్‌లు ఆడగా.. భారత్‌ విజయం సాధించింది. ఇక గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దాంతో.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. దాంతో.. ఆసియా కప్‌ జరిగే మ్యాచుల్లో అన్నింట్లో కన్న భారత్-పాక్‌ మ్యాచ్‌ పైనే ఆసక్తి ఎక్కువ మంది కనిపిస్తున్నారు.

ఈ క్రేజ్‌ ఉన్న మ్యాచ్‌కు సంబంధించి ఓ షాకింగ్‌ వార్త కలవరపెడుతోంది. భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు 90 శాతం వరణుడి ముప్పు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దాంతో.. శనివారం దాయదులతో పోరు ఉంటుందా..? లేదంటే వర్షం కారణంగా క్యాన్సిల్ అవుతుందా అనేది అనుమానంగా మారింది. శ్రీలంకలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. అదే సమయానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సాయంత్రం 5: 30 గంటల వరకు వర్షం కురిసే అవకాశాలు 90 శాతం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దాంతో.. మ్యాచ్‌ సజావుగా సాగుతుందో.. లేదో అని ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు టీవీ ఛానెళ్లు, ఓటీటీలు కూడా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఆరోజు జరిగే మ్యాచ్‌కు ఎప్పుడూ లేనంత క్రేజ్ ఉంటుంది. స్టేడియాలు నిండిపోవడం.. టీవీలు, ఓటీటీల్లో ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ను వీక్షిస్తారు. దాంతో.. టీఆర్పీ రేటింగ్స్‌ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తాయి. ఇక అభిమానులు అయితే మ్యాచ్‌ ఎలాగైనా జరిగితే బాగుండని అనుకుంటున్నారు. వరుణుడిని ఒక్కరోజు ఆగితే చాలు అంటూ మొక్కుతున్నారు.

కాగా.. ఆసియా కప్ 1984లో మొదలైంది. ఇప్పటి వరకు భారత్‌, పాకిస్తాన్ జట్లు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్‌ అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించింది. ఏడు మ్యాచుల్లో టీమిండియా గెలిచింది.. పాక్‌ ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో ఫలితం తేలలేదు. కాగా.. ఈసారి పాక్‌పై భారత్‌ విన్నింగ్ పర్సెంటేజ్ 53.85 శాతం ఉండగా.. పాకిస్తాన్ గెలుపు శాతం 35.71 శాతం ఉంది.

Next Story