మళ్లీ ఆ తప్పు చేయకు.. శుభ్‌మన్‌ గిల్‌కు యూవీ సూచన

శుభ్‌మన్ గిల్‌ పోస్టుపై తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆటగాడు యువరాజ్‌సింగ్ స్పందించాడు. గిల్‌కు కీలన సూచన చేశాడు.

By Srikanth Gundamalla  Published on  17 Sept 2023 12:21 PM IST
Asia Cup-2023, IND Vs Sri Lanka, Final, Gill, Yuvi,

మళ్లీ ఆ తప్పు చేయకు.. శుభ్‌మన్‌ గిల్‌కు యూవీ సూచన

ఆసియా కప్‌-2023 టోర్నీలో టైటిల్‌ కోసం శ్రీలంకతో తలపడేందుకు భారత జట్టు సిద్ధం అవుతోంది. అయితే.. అంతకుముందు సూపర్‌-4 దశలో బంగ్లాదేశ్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడినప్పటికీ భారత్‌ టోర్నీ ఫైనల్‌ చేరింది. బంగ్లాదేశ్‌పై ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌ రాణించాడు. సెంచరీ సాధించాడు. అయినా.. చివరకు ఓడిపోవడంతో అతడి పోరాటం వృధా అయిపోయింది. ఈ క్రమంలో శుభ్‌మన్‌ గిల్‌ తన సోషల్‌మీడియా అకౌంట్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఈ మ్యాచ్‌లో శతకం సాధించినా కీలక సమయంలో చెత్త షాట్‌ కొట్టడం వల్ల పెవిలియన్‌కు చేరాల్సి వచ్చిందని అన్నాడు. శుభ్‌మన్ గిల్‌ పోస్టుపై తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఆటగాడు యువరాజ్‌సింగ్ స్పందించాడు. గిల్‌కు కీలక సూచన చేశాడు.

శుభ్‌మన్‌ గిల్‌ సోషల్‌మీడియాలో సెంచరీ గురించి షేర్‌ చేస్తూ 'మ్యాచ్‌లో నా పోరాటం సరిపోలేదు. అయితే.. ఫైనల్స్‌కు మాత్రం అంతా సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు శుభ్‌మన్ గిల్. అంటే మరో కీలక ఇన్నింగ్స్‌ ఆడేందుకు శుభ్‌మన్‌ ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక శుభ్‌మన్‌ గిల్‌ పెట్టిన పోస్టుపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్ స్పందించాడు. గిల్‌ ఔట్‌ కావడానికి చెత్త షాట్ కారణమని చెప్పాడు. క్రీజులో ఉంటే తప్పకుండా ఒంటిచేత్తో గెలిపించేవాడని యూవీ పేర్కొన్నాడు. అయినప్పటికీ అద్భుతంగా ఆడాడు అని.. ఫైనల్‌ పోరులో అలాంటి పొరపాటు చేయొద్దని శుభ్‌మన్‌ గిల్‌కు యూవీ సూచించాడు.

సూపర్‌-4లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడ్డ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ రాణించలేకపోయింది. కానీ శుభ్‌మన్‌ గిల్‌ (121) పరుగులు చేసి రాణించాడు. అయితే.. చివరకు ఆరు పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. కాగా.. ఆ మ్యాచ్‌తో సంబంధం లేకుండా భారత్‌ నేరుగా ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో శ్రీలంకతో తలపడనుంది. ఆ టీమ్‌ను కూడా తక్కువ అంచనా వేయొద్దని.. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించాల్సిందే అని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

Next Story