రోహిత్, కోహ్లీలకి షాకిచ్చిన నెహ్రా
Ashish nehra ipl team .. ఈ మధ్యకాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారమైంది. మెగా టోర్నీలకు
By సుభాష్ Published on 19 Nov 2020 11:17 AM GMTఈ మధ్యకాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారమైంది. మెగా టోర్నీలకు ముందు, తర్వాత వారి వారికి నచ్చిన ఆటగాళ్లతో జట్లను ప్రకటిస్తారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగిసిన నేపథ్యంలో తాజాగా టీమ్ఇండియా మాజీ పేసర్ నెహ్రా తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. ఈ సీజన్‌లో ఆటగాళ్లు ప్రద్శరించిన ఆటతీరు ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసిన నెహ్రా చెప్పారు. అయితే.. తన టీమ్‌లో కోహ్లీకి చోటివ్వలేదు. అతడి స్థానంలో ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేయని కారణంగా చెన్నై కెప్టెన్ ధోనికి కూడా జట్టులో చోటు ఇవ్వలేదు.
ఓపెనర్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసుకున్నాడు. మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను నెహ్రా ఎంపిక చేశాడు. సూర్యకుమార్ గత మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఈసీజన్లో కూడా పరుగుల వరద పారించాడు. నాలుగో స్థానంలో ఆర్‌సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేసిన ఆశిష్ నెహ్రా.. అతడు లేకుండా టీ20 జట్టేదీ ఉండదన్నాడు. ఐదో స్థానంలో ముంబై ఇండియన్స్ యువ ప్లేయర్ ఇషాన్ కిషన్, ఆరో స్థానంలో ముంబై ఇండియన్స్ హిట్టర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసుకున్నాడు. ముంబై తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్‌ను తన జట్టు వికెట్ కీపర్‌గా నెహ్రా తీసుకున్నాడు.
బౌలర్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ పేసర్ జోఫ్రా ఆర్చర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్న ఆశిష్ నెహ్రా.. వీరిద్దరూ బ్యాటింగ్ కూడా చేయగలరన్నాడు. బెంగళూరు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రాను జట్టులోకి తీసుకున్నాడు. చివరి స్థానం కోసం మొహమ్మద్ షమీ, ఆర్ అశ్విన్‌లు ఎంచుకున్నాడు. ముగ్గురు పేసర్లతో ఆడాల్సి వస్తే షమీని తుది జట్టులోకి తీసుకుంటానని.. లేదంటే అశ్విన్‌ను ఎంపిక చేస్తానని నెహ్రా చెప్పాడు.
నెహ్రా ఐపీఎల్ 2020 డ్రీమ్ జట్టు :
కేఎల్ రాహుల్, డేవిడ్ వార్నర్, సూర్యకుమార్ యాదవ్, ఏబీ డివిలియర్స్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జోఫ్రా ఆర్చర్, రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ/ఆర్ అశ్విన్