రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:43 PM IST
రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకున్న షమీ
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ప్రతిష్టాత్మక అర్జున అవార్డును అందుకున్నారు. వన్డే వరల్డ్ కప్-2023లో షమీ అద్బుత ప్రదర్శనను కనబర్చిన విషయం అందరికీ తెలిసిందే. మొదట కొన్ని మ్యాచ్‌లు ఆడకపోయినా.. ఆ తర్వాత షమీ ఆడిన మ్యాచుల్లో ప్రత్యర్థుల వికెట్లను తీసి వారి నడ్డీ విరిచాడు. 7 మ్యాచుల్లో ఏకంగా మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం షమీకి అర్జున అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఈ అవార్డును షమీకి అందించారు.
కాగా.. షమీకి కంటే ముందు పలువురు భారత క్రికెట్ ఆటగాళ్లు కూడా ఈ అవార్డును అందుకున్నారు. 2021లో శిఖర్ ధామన్, 2019లో రవీంద్ర జడేజా, 2015లో రోహిత్ శర్మ, 2014లో అశ్విన్, 2013లో విరాట్ కోహ్లీ అర్జున అవార్డును అందుకున్నవారి లిస్ట్‌లో ఉన్నారు. మహ్మద్ షమీతో పాటు ఇతర క్రీడల్లో అద్భుతంగా రాణించిన 26 మంది క్రీడాకారులకు కూడా అర్జున అవార్డులు లభించాయి.
అర్జున అవార్డు అందుకున్న క్రీడాకారులు:
ఆర్చరీ – అదితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్రవీణ్ డియోటలే
అథ్లెటిక్స్ – పరుల్ చౌదరీ, శ్రీశంకర్ మురళి
బాక్సింగ్ – మహ్మద్ హుసాముద్దీన్
చెస్ – ఆర్ వైశాలి
క్రికెట్ – మహ్మద్ షమీ
ఈక్వెస్ట్రియన్ – అనుష్ అగర్వాల
ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ – దివ్యక్రితి సింగ్
గోల్ఫ్ – దిక్షా దగర్
హాకీ – కృష్ణన్ బహూదర్ పాఠక్, పుఖ్రంబం సుహిలా చాను.
కబడ్డీ – పవన్ కుమార్, రీతు నేగీ
ఖో ఖో – నస్రీన్.
లాన్ బౌల్స్ – పింకీ
షూటింగ్ – ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. ఈషా సింగ్
స్క్వాష్ – హరీందర్ పాల్ సింగ్ సాధు
టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగల్
రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగల్
వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి
పారా ఆర్చరీ – శీతల్ దేవి
అంధుల క్రికెట్ – ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి
పారా కనోయింగ్ – ప్రచీ యాదవ్