మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం విశేషం. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ కు పాపులారిటీ చాలా ఉన్నప్పటికీ.. సచిన్ లాగా చిన్న వయసులోనే అద్భుతాలు సృష్టించడం లేదు. సచిన్ కూడా కొడుకు విషయంలో పెద్దగా మీడియా అటెన్షన్ ఇవ్వకుండా వెళుతున్నారు. తాజాగా అర్జున్ మాత్రం తన ఆటతోనే వార్తల్లో నిలిచాడు. సచిన్ లాగే ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. సచిన్ టెండూల్కర్ 1988లో గుజరాత్‌పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.
గోవా జట్టు 78.1 ఓవర్లలో గోవా 4 వికెట్లకు 196 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఆల్ రౌండర్ అర్జున్ క్రీజులో అడుగుపెట్టగా.. రెండో రోజు తన తొలి సెంచరీ (207 బంతుల్లో 120 పరుగులు) చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. సచిన్ 1988లో గుజరాత్‌పై 15 ఏళ్ల వయస్సులో రంజీ ట్రోఫీలో ముంబై తరఫున తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని సాధించాడు. ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత, 23 ఏళ్ల అర్జున్ పోర్వోరిమ్‌లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో సెంచరీని అందుకున్నాడు. స్వతహాగా అర్జున్ టెండూల్కర్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్.