గుర్రాలకు ఇచ్చే ఉత్ప్రేరకాన్ని వాడిన మహిళా బాక్సర్ అవుట్..!

By అంజి  Published on  3 Dec 2019 6:57 AM GMT
గుర్రాలకు ఇచ్చే ఉత్ప్రేరకాన్ని వాడిన మహిళా బాక్సర్ అవుట్..!

ఒక వైపు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు భారత్ సంసిద్ధమౌతున్న సమయంలోనే దేశానికి కోలుకోలేని పెద్ద షాక్ తగిలింది. మన దేశానికి పతకం ఆశలున్న మహిళా బాక్సర్‌ నీరజ్‌ ఫోగాట్ (57 కిలోలు) డోప్‌ పరీక్షలో విఫలమైంది.

హర్యాణాకు చెందిన ఈ మహిళా బాక్సర్ బాక్సర్‌ సామర్థ్యాన్ని పెంచె ఉత్ర్పేరకం లిగాన్‌డ్రోల్‌తో పాటు మరికొన్ని అనబాలిక్‌ స్టెరాయిడ్స్‌ వాడినట్లు డోపింగ్ పరీక్షల్లో తేలింది. దీంతో నీరజ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ ఉత్ప్రేకరాన్ని మామూలుగా రేసుల్లో పాల్గొనే గుర్రాలకు ఇస్తారు. దీనితో దానిలో వేగం పెరుగుతుంది. దీని వల్ల కండరాలు కూడా బలంగా పెరుగుతాయి. సెలెక్టివ్ యాండ్రోజెన్ రిసెప్టర్ మాడ్యులేటర్‌గా పని చేసే ఈ మందు వల్ల పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది.

ఈ సెప్టెంబరు 24న ఆమె వద్ద నుంచి సేకరించిన సాంపిల్స్‌ను దోహాలో ఉన్న డోపింగ్‌ నిరోధక ల్యాబ్‌కు పంపించడం జరిగింది. అక్కడ జరిగిన పరీక్షలో ఆమె శాంపిల్‌ లో లిగాండ్రోల్ ఉన్నట్టు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించింది. దీంతో ఆమె ఒలింపిక్స్ లో పాల్గొనే విషయంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

అయితే ఈ ఉత్ప్రేరకంపై పూర్తిస్థాయి నిషేధం లేదు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని అమెరికన్లు ఉత్పాదన చేశారు. ప్రస్తుతం ఇది బ్లాక్ మార్కెట్‌లోనే దొరుకుతోంది. ఆస్ట్రేలియాకి చెందిన స్విమ్మర్ షేనా జాక్ దీనిని వాడటంతో ఈ లిగాండ్రోల్ గురించి చర్చ చెలరేగింది. ఇప్పుడు నీరజ్ ఫోగాట్ దీన్ని వాడటంతో చర్చ మరింత రచ్చకెక్కుతుంది.

Next Story