ఆంధ్రప్రదేశ్‌లో ఇక పై ఇలా చేశారో.. జైలు ఖాయం
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 7:59 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) వ్యాప్తిని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. తాజాగా ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేదం విధించారు. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయం పై నిషేదం విధించారు. ఈ నిబంధనను ఉల్లంగిస్తే ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఉచితంగా రాష్ట్ర ప్రజలందరికి మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీని వల్ల కరోనా వల్ల కొంత రక్షణ లభిస్తుందని తెలిపారు. కరోనా హైరిస్క్ ఉన్నవారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.