ఉమ్మివేశాడు.. జ‌రిమానా క‌ట్టాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 5:54 AM GMT
ఉమ్మివేశాడు.. జ‌రిమానా క‌ట్టాడు

క‌రోనా వైర‌స్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఇప్ప‌టికే ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌ల‌ను తీసుకుంది. లాక్‌డౌన్‌ను విధించిన‌ప్ప‌టికి కొంద‌రు దీనిని అతిక్ర‌మిస్తున్నారు. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే.. బ‌హిరంగ ప్ర‌దేశంలో ఉమ్మి వేయ‌డంతో ఓ వ్య‌క్తికి రూ.500 జ‌రిమానా విధించారు. ఈ ఘ‌ట‌న రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో జ‌రిగింది.

వీర్న‌ప‌ల్లి మండ‌లం అడ‌విప‌దిర గ్రామానికి చెందిన ల‌క్కం బాబు గురువారం బ‌హిరంగంగా ఉమ్మి వేశాడు. గ్రామ స్ప‌రంచ్ సాగ‌ర్‌, కార్య‌ద‌ర్శి రవిలు గ‌మ‌నించి రూ.500 జ‌రిమానా విధించారు. దీనిని బాబు నుంచి వ‌సూలు చేశారు. కరోనా నివారణలో భాగంగా రోడ్లపై ఉమ్మి తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

Next Story
Share it