స్పైడర్ ఉమెన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 5:20 AM GMT
స్పైడర్ ఉమెన్

మీరు ఎప్పుడైనా స్పైడర్ ఉమెన్‌ని చూసారా. సినిమాలో కాదు రియల్ లైఫ్‌లో.. అచ్చంగా ఒక స్పైడర్‌లా గోడంతా పాకేసే మహిళ ఇండోనేషియాకు చెందిన ఎరీస్ సుసంతి రహాయి. ఇప్పుడు తను చేసిన వాల్ క్లైంబింగ్ వీడియో వైరల్ అవుతోంది. కేవలం ఏడు సెకండ్లలోపే ఆమె 15 మీటర్ల గోడను అలవోకగా పాకేసింది. చైనాలోని క్సియామెన్‌లో నిర్వహించిన ఐఎఫ్ఎస్‌సీ క్లైంబింగ్‌ ప్రపంచకప్‌ మహిళల విభాగంలో ఈ అథ్లెట్‌ సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. 15 మీటర్ల గోడను కేవలం 6.995 సెకన్లలో పాకి వాహ్ వా అనిపించుకుంది. గతంలో ఈ రికార్డు 7.101 సెకన్లకు ఉండేది. చేతివేలికి గాయం ఉన్నప్పటికీ ఎరిస్ వెనుకడుగు వేయకుండా ప్రయత్నం చేసింది. అయితే రికార్డ్ సాధిస్తానని మాత్రం అనుకోలేదని చెబుతోంది విజేత ఎరీస్‌ సుసంతి. గట్టిగా ఊపిరి తీసి వదిలేలోగా గోడ ఎక్కేసి రికార్డు సృష్టించిన ఎరీస్‌ను ఇప్పుడందరూ స్పైడర్ ఉమెన్ అంటున్నారు.Next Story