7 సెకన్లలలోపు గోడ ఎక్కేసింది... అమ్మాయా?? స్పైడర్ వుమనా???

By సత్య ప్రియ  Published on  24 Oct 2019 8:24 AM GMT
7 సెకన్లలలోపు గోడ ఎక్కేసింది... అమ్మాయా?? స్పైడర్ వుమనా???

నిజమే విన్నారు... 7 సెకన్లల లోపు నిలువు గోడ ను ఎక్కి రికార్డు నెలకొల్పింది ఇండోనేషియా కి చెందిన ఎరీస్ సుసంతి రహయు. వాల్ క్లైంబింగ్‌లో ఇదివరకూ ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. 15 మీటర్ల గోడను కేవలం 7 సెకన్ల లోపు సరసరా పాకేసింది.

చైనాలోని క్సియమెన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్ క్లైంబింగ్ (IFSC) పోటీలో పాల్గొని ప్రపంచ కప్ కొట్టేసింది. మహిళల విభాగంలో ఈ అథ్లెట్ సాధించిన సరికొత్త రికార్డు ఔరా అనిపిస్తోంది. 15 మీటర్ల గోడను 6.995 సెకన్లలో ఎక్కేసి రికార్డు బ్రేక్ చేసింది.



బల్లిలా పాకి అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా, ఇప్పుడు ఆ వీడియో చూసినవారంతా ముక్కున వేలేసుకుంటున్నారు, ఆమెను పొగడకుండా ఉండలేకపోతున్నారు.

Next Story