గాంధీ కుటుంబంపై మోదీ మార్క్‌ రాజకీయం...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 12:16 PM GMT
గాంధీ కుటుంబంపై మోదీ మార్క్‌ రాజకీయం...!

ఢిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు జడ్ ప్లస్ భద్రత మాత్రమే ఉంటుంది. నాయకుల భద్రతపై ఇటీవల జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. జడ్ ప్లస్ కింద 100 మంది సీఆర్‌పీఎఫ్ భద్రతా సిబ్బంది ఉంటారు. 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత వీరి కుటుంబానికి ఎస్‌పీజీ భద్రత కల్పించారు. 1988లో ఎస్పీజీని స్థాపించారు. ఇందిరా గాంధీ హత్య తరువాత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏర్పాటు చేశారు.

మరో వైపు అమిత్ షా ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ విరమించుకోవడంపై నిరసనకు దిగారు.

Image

Image



Next Story