20 నుంచి ప్రత్యేక రైళ్లు
By సుభాష్ Published on 16 Oct 2020 2:43 AM GMTరైల్వేశాఖ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే జోన్లవారీగా 392 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ కొత్త రైళ్లు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అయితే వీటి టికెట్ ధరలు కూడా ఎక్కువే ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో కొన్ని రోజూ నడుస్తుండగా, మరికొన్ని రైళ్లు వారంలో నాలుగు రోజులు, ఇంకొన్ని రైళ్లు వీకెండ్‌లో నడవనున్నాయి. ఇక ఈ రైళ్లన్నీ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ కొత్త రైళ్లు నవంబర్ 30 వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల టికెట్ బుకింగ్ విషయంలో పాత రిజర్వేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎక్కువగా ఏపీ ఎక్స్ ప్రెస్, దురోంటో, రాజధాని, శతాబ్ది కేటగిరికి చెందినవి ఉన్నాయి.