జ‌క్క‌న చెక్కిన చిత్రాలు.. జ‌క్క‌న గురించి నిజాలు : పార్ట్- 3

By Medi Samrat  Published on  17 Oct 2019 12:26 PM GMT
జ‌క్క‌న చెక్కిన చిత్రాలు.. జ‌క్క‌న గురించి నిజాలు : పార్ట్- 3

రాజ‌మౌళిని ఎంత‌గానో ప్ర‌భావితం చేసిన సినిమా 'శివ‌'. ఎంద‌రిలోనో స్పూర్తి క‌లిగించిన 'శివ' సినిమా గురించి రాజ‌మౌళి ఓ సంద‌ర్భంలో త‌న స్పంద‌న‌ను తెలియ‌చేసారు. అది ఏంటో రాజ‌మౌళి మాటల్లోనే... 'శివ' రిలీజ్ అయిన‌ప్పుడు నేను జూనియ‌ర్ ఇంట‌ర్మీడియ‌ట్ చదువుతున్నాను. కొవ్వూరులో ఉన్నాను. కొవ్వూరులో సినిమా రిలీజ్ కాలేదు. సినిమా చూసిన‌వాళ్లంద‌రూ మాట్లాడుకుంటున్నారు. వ‌న్ వీక్ 10 డేస్ త‌ర్వాత‌ ఏలూరు వెళ్లాల్సిన ప‌ని ప‌డింది. ఏలూరులో ఫ‌స్ట్ ఇంట‌ర్మీడియ‌ట్ చేసాను. స‌ర్టిఫికెట్ తీసుకోవ‌డానికి వెళ్లాను.

Related image

ఉద‌యాన్నే బ‌య‌లుదేరి వెళ్లి ప‌ని చూసుకుని సినిమా చూడ‌డానికి వెళ్లాను. అప్ప‌టికీ సినిమా టెక్నిక్ గురించి.. కెమెరా యాంగిల్స్ ఇవేవీ తెలియ‌దు. ఆ సినిమా చూసిన‌ప్పుడు నాకు గుర్తు ఉన్న‌ది ఏంటంటే... ఇంట‌ర్వెల్ లో ఒక్కొక్క‌రి ఫేస్ చూస్తే... అద్భుతం అనే ఫీలింగ్ లో ఉన్నారు. అది నాకు క్లియ‌ర్ గా గుర్తుంది. 1991లో ఇండ‌స్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌చ్చాను. అప్పుడు రామ్ గోపాల్ వ‌ర్మ గారి 'క్ష‌ణ క్ష‌ణం' సినిమా జ‌రుగుతుంది.

Image result for keeravani

ఆ సినిమాకి పెద్ద‌న్న‌య్య (కీర‌వాణి) మ్యూజిక్ డైరెక్ట‌ర్. అన్న‌య్య చెబుతుండేవారు రామ్ గోపాల్ వ‌ర్మ గారు ఎలా ఉంటారు..? ఎలా మాట్లాడ‌తారు..? అనేది. ఇండ‌స్ట్రీ గురించి, టెక్నిక్ గురించి తెలిసిన త‌ర్వాత‌ వ‌ర్మ గారంటే విప‌రీత‌మైన అభిమానం పెరిగింది. మెయిన్ గా శివ ద్వారా నేర్చుకున్న‌ది ఏంటంటే... బిల్డ‌ప్.

Image result for ram gopal varma

నా ప్ర‌తి సినిమాలో ఫాలో అయ్యేది ఏంటంటే... ఫైట్ అనేది కంప‌ల్స‌రీ. హీరో, విల‌న్ ని కొట్టాలంటే రెండు ఉండాలి. 1) హీరో, విల‌న్ ని కొట్టాల‌ని ఆడియ‌న్ కి అనిపించాలి. శివ‌లో జె.డి.చ‌క్ర‌వ‌ర్తి లెక్చ‌ర‌ల్ ఎదురుగా సిగరెట్ కాల్చితే వెంట‌నే ఆడియ‌న్ కి కొట్టాలి అనిపించేసింది. కొట్టాలి అనిపించిన త‌ర్వాత దానిని ఎంత డిలే చేయాలి. కొట్టాల‌నిపించిన‌ప్పుడు వెంట‌నే కొట్టేస్తే.. కిక్ ఉండ‌దు సినిమాలో. ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చి ఆ టెంప‌రేచ‌ర్ పెంచి అప్పుడు కొట్టాలి. శివ సినిమా చూసి ఆ సినిమాలో ఫైట్ తీసాను. (ఇంకా ఉంది)

Next Story