విష్ణు మూర్తిని స్తుతించి.. ఆ స్తోత్రం పఠించారంటే..

By Newsmeter.Network  Published on  5 March 2020 1:23 PM GMT
విష్ణు మూర్తిని స్తుతించి.. ఆ స్తోత్రం పఠించారంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ఇప్పటికే 3వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కరోనా పేరు చెబితే చాలు వణికిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు మందు కనిపెట్టలేదు.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వైరస్ నుంచి తమను రక్షించాలని వందలాది మంది భక్తులు భగవంతున్ని వేడుకున్నారు. భక్తులచే ఆలయ అర్చకులు అపమార్జన స్తోత్రం, సుదర్శన అష్టకం పఠింప చేశారు. దేశం మొత్తాన్ని కరోనా వైరస్ బారి నుంచి రక్షణ కల్పించాలని బాలాజీని వేడుకున్నారు. విష్ణు మూర్తిని స్తుతిస్తూ అపమార్జన స్తోత్రం పఠించడం ద్వారా విష జ్వరాలు, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆలయ అర్చకులు వెల్లడించారు.

తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ సోకలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయ్‌లో కరోనా సోకిందన్నారు. మైండ్‌స్పేస్‌ ఉద్యోగికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని, కరోనాపై అతిగా స్పందించొద్దని సూచించారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Next Story
Share it