ఒకే దేశం - ఒకే మార్కెట్‌ విధానం అమలు చేస్తున్నాం: మంత్రి నిర్మలాసీతారామన్‌

By సుభాష్  Published on  16 May 2020 7:59 PM IST
ఒకే దేశం - ఒకే మార్కెట్‌ విధానం అమలు చేస్తున్నాం: మంత్రి నిర్మలాసీతారామన్‌

ఒకే దేశం- ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నాలుగో విడత ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు ప్రకటించారు. ఈ ప్యాకేజీలో పలు రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌ను తీరర్చిదిద్దే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, బీఏఎఫ్‌ఆర్‌ అమలు కేంద్ర సర్కార్‌ ఎంతో ముందుందని చెప్పారు. రాబోయే రోజుల్లో పోటీకి అనుగుణంగానే భారత్‌ రెడీ అవుతోందని పేర్కొన్నారు.

దేశంలో వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని బలోపేతం చేసే విధంగా ప్రధాని మోదీ ఎన్నోఅద్భుతమైన సంస్కరణలు చేపట్టారని అన్నారు. ఒకే దేశం - ఒకే మార్కెట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నామని నిర్మలాసీతారామన్‌ అన్నారు.

దేశంలో 1991లో పీవీ నరసింహరావు ఆధ్వర్యంలో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎంతో పుంచుకుందని గుర్తు చేశారు. ఆర్థికంగా భారత్‌ ఎదడంతో పాటు ఉత్పత్తి రంగాన్ని పెంపొందించే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి రంగ అభివృద్ది చెందితే ఇక్కడి నుంచే అనేకమైన వస్తువులు తయారవుతాయని పేర్కొన్నారు.

Next Story