కరోనా సోకి స్పెయిన్‌ రాణి మృతి

By అంజి  Published on  29 March 2020 7:29 AM GMT
కరోనా సోకి స్పెయిన్‌ రాణి మృతి

ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య ఇప్పటికే 6 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 30 వేలకు చేరువలో ఉంది. అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. స్పెయిన్‌లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉంది. తాజాగా కరోనా సోకి స్పెయిన్‌ రాణి మారియా థెరీసా మృతి చెందారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. కరోనా వ్యాధి సోకి మరణించిన తొలి రాజ కుటుంబ మహిళగా మారియా ఉన్నారు. గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న యువరాణి మరణించారని ఆమె సోదరుడు ప్రిన్స్‌ ఎన్రిక్‌ డి బోర్బన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. కరోనా సోకిన నాటి నుంచే ఆమెకు చికిత్స చేసిన.. వృద్ధురాలు కావడంతో మహమ్మారిని జయించలేకపోయిందని ఆయన తెలిపారు.

Also Read: టీడీపీ ఆవిర్భావ దినోత్సం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన చంద్రబాబు

శనివారం నాడు ఒక్కరోజే స్పెయిన్‌లో 6,500 కొత్త కరనా కేసులు నమోదు అయ్యాయి. 832 మంది మహమ్మారితో పోరాడి ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 9 వేల మందికిపైగా ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 73 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 5,982 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కావడం గమనార్హం.

Also Read: కరోనా పరీక్షలు చేయించుకుంటేనే కాపురం..

ఇటలీ, స్పెయిన్‌, చైనా, అమెరికాలో ఇప్పటి వరకు అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనైతే కరోనా విలయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌ ప్రధాని కరోనా సోకిన విషయం తెలిసిందే. వేల్స్‌ యువరాజు చార్లెస్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలిందని వైద్యులు ధ్రువీకరించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా, ఎవరీని కూడా కరోనా వదలడం లేదు.

Next Story