చిన్నప్పటి నుంచే బాలుతో పరిచయం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
By సుభాష్ Published on 25 Sept 2020 3:32 PM ISTప్రముఖ గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలు మృతి పట్ల ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'ప్రముఖ నేపథ్య గాయకుడు ఐదు న్నర దశాబ్దాలుగా అమృతమైన గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్ర్భాంతికి గురి చేసింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం బాధాకరం.
వివిధ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన బాలు.. ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది గాయకులను వెలుగులోకి తీసుకువచ్చారు. వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. బాలుతో చిన్నప్పటి నుంచే పరిచయం ఉందని, ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోష పడ్డానని, కానీ చివరికి ఇలా జరగడం చాలా బాధకరమని అన్నారు. ఇంతటి గొప్ప నాయకుడి మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. సుమారు 40వేలకు వరకు మధురమైన పాటలను అందించిన బహుముఖ గాయకుడిని కోల్పోవడం ఎంతో విచారకరమన్నారు.