బాలుని కడసారి చూడలేకపోయా: యేసుదాసు ఆవేదన
By సుభాష్ Published on 27 Sept 2020 2:03 PM ISTగాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో యావత్ సినీ ప్రపంచంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆయన ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు చేసిన పూజలు ఫలించలేదు. ఆయన మరణ వార్త విని ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు యేసుదాసు బాలు మరణవార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. బాలసుబ్రహ్మణ్యం తనకు సొంత సోదరుడి కంటే ఎక్కువ అని, ఆయనతో కలిసి చాలా ఏళ్లు ప్రయాణం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న యేసుదాసు భారత్‌కు రావడానికి అనుమతి లేకపోవడంతో చివరిసారిగా తన సోదరుడిని చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. భౌతికంగా బాలు లేకపోయినా.. ఆయన ఎల్లప్పుడు గుర్తిండిపోతారని అన్నారు. బాలుతో చాలా కాలం ప్రయాణం చేశాను.. సంగీత ప్రపంచలో బాలు అందనంత ఎత్తుకు ఎదిగారని, సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోలేకపోయినా సంగీత రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సాధించిన ఘటన బాలుకే దక్కిందన్నారు. అమెరికాలో ఓ సారి బాలు వంట కూడా చేసి పెట్టారని యేసుదాసు గుర్తు చేసుకున్నారు. బాలును కడసారి చూపు నోచుకోకపోడంతో యేసుదాసు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. కాగా, సంగీత ప్రపంచంలో యేసుదాసు, బాలు లెజండ్లు కాగా, వీరిద్దరి కాంబోలో ఎన్నో పాటలు వచ్చాయి. ఆ పాటలన్నీ మంచి విజయాలు సాధించాయి.