వదల బొమ్మాళి అంటోన్న నైరుతి రుతుపవనాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2019 9:11 PM ISTనైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ నెల 20 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్ నెలాఖరుతో రుతుపవనాలు మొదలు కావాల్సి ఉంది. హిందూ మహా సముద్రంలో 'డైపోల్' ప్రభావం వలన ఆలస్యంగా వెనుదిరుగుతున్నాయి. హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ఒక క్రమ పద్ధతి లేకుండా పెరుగుతూ, తగ్గుతుండటాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD) అని పిలుస్తారు. రాజస్థాన్, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో బుధవారం నుంచి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనా దేశంలోని మిగిలిన ప్రాంత్రాల్లో మాత్రం ఇంకా చురుకుగా ఉన్నాయి.
1961 తరువాత ఇదే ప్రథమం
1) దేశ వ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు వర్షాలు కురవకుండా ఉంటేనే నైరుతి రుతుపవనాల తిరోగమనం పూర్తియినట్టుగా భావిస్తారు.
2) ఉపరితల ఆవర్తనాలు నిలిచి పోయి ఆకాశం నిర్మలంగా ఉండాలి.
3) అక్టోబరు నెలలో కూడా రుతుపవనాలు కొనసాగడం 1961 తర్వాత ఇదే ప్రథమం.
4) 25 ఏళ్ల తర్వాత సాధారణ వర్షపాతం కంటే 10 శాతం అధికంగా నమోదవడం రికార్డుగా చెప్పుకోవాలి.