కారు& బైక్ నుండి ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ గెలిచిన యెజ్డీ రోడ్ స్టర్
జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ వారి ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ యెజ్డీ రోడ్ స్టర్ కార్ & బైక్ నుండి “బైక్ డిజైన్ ఆఫ్ ది ఇయర్” అవార్డ్ ను గెలిచింది,
By - న్యూస్‌మీటర్ తెలుగు |
జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ వారి ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ యెజ్డీ రోడ్ స్టర్ కార్ & బైక్ నుండి “బైక్ డిజైన్ ఆఫ్ ది ఇయర్” అవార్డ్ ను గెలిచింది, మోటార్ సైకిల్ యొక్క పెరుగుతున్న గౌరవాల్లో మరొక పెద్ద గుర్తింపును జోడించింది. ఈ సంవత్సరం ఆరంభంలో, జీ మీడియా ఆటో అవార్డ్స్ లో రోడ్ స్టర్“ ఉత్తమమైన 350 సిసి మోటార్ సైకిల్“ గా కూడా ఎంపికైంది.
ప్రముఖ ఆటోమోటివ్ డిజైనర్ థామర్ దాల్, స్ట్రేట్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఇండియా యొక్క డీన్ నుండి క్లాసిక్ లెజెండ్స్ సహ-స్థాపకుడు బొమన్ ఇరాని అవార్డ్ అందుకున్నారు. ఈ గౌరవం ఒక స్థిరమైన రూపురేఖలు, బలమైన నిష్పత్తులు మరియు మాడ్యులార్ విలక్షణతలు ఆధారంగా రూపొందించిన ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ డిజైన్ తో రోడ్ స్టర్ యొక్క క్లాసిక్ రోడ్ స్టర్ సాహసవంతమైన పునఃవ్యాఖ్యానంని గుర్తించింది.
కంపెనీ వారి డిజైన్ -ఫస్ట్ విధానం యెజ్డీ రోడ్ స్టర్ ను ఊహించదగిన రెట్రో టెంప్లెట్స్ ను మించి ముందుకు తీసుకువెళ్లింది. పొడవైన, దిగువగా స్థిరపరచబడిన, మరియు లోపాలు లేని ఆధిపత్యంగా రూపొందించబడిన మోటార్ సైకిల్ ఎర్గోనమిక్స్ మరియు రోజూవారీ రోడ్ స్టర్ వినియోగంతో క్రూజర్ రూపాన్ని మిశ్రమం చేసింది. 12.5 లీటర్ ఇంధనం ట్యాంక్ యెజ్డీ వారి దశాబ్దాల కాలం నాటి దీర్ఘమైన దృశ్యపరమైన వారసత్వానికి ఒక గౌరవంగా రూపొందించబడింది మరియు మోటార్ సైకిల్ యొక్క బలమైన రోడ్డు ఉనికిని పునః శక్తివంతం చేసింది. లిక్విడ్-కూల్డ్ 350 సిసి ఆల్ఫా2తో, శ్రేణిలో మొదటి 6-స్పీడ్ గేర్ బాక్స్ మరియు హుడ్ కింద అసిస్ట్ & స్లిప్పర్ క్లచ్ తో, రోడ్ స్టర్ రైడర్ కు ముందు వైపు మరియు మధ్యలో సౌకర్యాన్ని ఉంచుతుంది: ఇది చేరుకోగలిగిన సీట్ ఎత్తు, కావలసినంత గ్రౌండ్ క్లియరెన్స్, మరియు విశ్రాంతిదాయకమైన ఎర్గోనమిక్స్ ను కలిగి ఉంది.
బొమన్ ఇరాని, సహ-స్థాపకుడు క్లాసిక్ లెజెండ్స్, ఇలా అన్నారు “కారు & బైక్ నుండి గుర్తింపు ముఖ్యంగా డిజైన్ విషయంలో కావలసినంత ప్రాధాన్యతను ఇస్తుంది. క్లాసిక్ నిష్పత్తుల గురించి ఉద్దేశ్యపూర్వకంగా పునః ఆలోచన చేస్తూనే యెజ్డీ యొక్క స్థిరమైన గర్వం లక్షణానికి కట్టుబడి సృష్టించబడింది, 1970 నుండి బ్రాండ్ ను నిర్వచించిన సిద్ధాంతం ఇది భారతదేశంలో జనించిన ఏకైక క్లాసిక్ మోటార్ సైకిల్ మార్క్ కారణంగా యెజ్డీ ఎల్లప్పుడూ ఆ సూచనలను సవాలు చేసింది. రోడ్ స్టర్ ఆ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. దీని డిజైన్ నిశ్యబ్దమైన ఆధునిక షాడో బ్లాక్ నుండి రెట్రో రెడ్ ఉల్ఫ్ కు సులభంగా మారగలదు. ఆ విలక్షణతనే మేము సాధించాలని ఖచ్చితంగా నిర్ణయించాము.”
ప్రత్యేకమైన డిజైన్ ఆవిష్కరణ అనేది యెజ్డీ రోడ్ స్టర్ యొక్క మాడ్యులార్ సీటింగ్. ఇది రైడర్స్ సింగిల్-సీట్ బాబర్ ఏర్పాటు నుండి డ్యూయల్-సీట్ టూరింగ్ ఆకృతికి అందంలో ఎలాంటి రాజీ లేకుండానే నిముషాల్లో మారడానికి అవకాశం ఇస్తుంది. డిజైన్ టీమ్ రియర్ విభాగాన్ని రూపొందించారు. అందువలన పిలియన్ సీటును తొలగించినప్పుడు, మోటార్ సైకిల్ బయటకు కనిపించే బోల్ట్స్ లేకుండా శుభ్రమైన, పూర్తయిన బొబ్బర్ (తగ్గించబడిన)రూపాన్ని ఇస్తుంది. ఎన్నో మాడ్యులార్ క్రూజర్ డిజైన్ లు ఈ విషయంలో వెనకబడ్డాయి.
అఖిలేష్ మన్ చందాని, హెడ్, కాన్సప్ట్ డిజైన్, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ ఇలా అన్నారు, “డిజైన్ వివరాలు చెప్పటానికి సులభమైనవి కానీ అమలు చేయడం సవాలుతో కూడినవి: ఆధిపత్యంతో మరియు స్థిరంగా అనిపించే మోటార్ సైకిల్ ను రూపొందించడంతో పాటు రోజూ రైడింగ్ చేయడానికి ఆచరణీయంగా ఉన్న మోటార్ సైకిల్ ను తయారు చేయడం. మాడ్యులార్ రియర్ సీట్ పజిల్ లో కఠినమైన అంశం. బొబ్బర్ గా సోలోగా నడిపినా లేదా పిలియన్ తో నడిపినా, యెజ్డీ రోడ్ స్టర్ శుద్ధి చేయబడినదిగా మరియు పూర్తయినదిగా కనిపిస్తుంది. వివరానికి మరియు క్లాసిక్ మోటార్ సైకిల్ డిజైన్ ను మరికొంచెం అభివృద్ధి చేయడానికి ఈ అవార్డ్ ఇలాంటి శ్రద్ధకు గుర్తింపు.”
యెజ్డీ రోడ్ స్టర్ కీలకమైన డిజైన్ అంశాలు:
ప్రత్యేకమైన క్రూజర్ -ప్రేరేపిత రూపం: పొడవైన, స్థిరమైన డిజైన్ క్రూజర్ వంటి అమోఘమైన రూపం ఇస్తుంది మరియు రోజూ రైడింగ్ చేయడానికి సౌకర్యవంతమైన రోడ్ స్టర్ యొక్క అనుకూలతలను కూడా నిర్వహిస్తుంది.
తీర్చిదిద్దబడిన హెరిటేజ్ ఫ్యూయల్ ట్యాంక్: పార్శీ ఫరావహర్ ప్రత్యేకమైన చిహ్నంతో పునః వ్యాఖ్యానం చేయబడిన టియర్ డ్రాప్ ట్యాంక్ మోటార్ సైకిల్ దృశ్యపరంగా ఆకర్షణను కలగ చేయడమే కాకుండా బ్రాండ్ యొక్క చారిత్రక డిజైన్ భాషకు జోడిస్తుంది.
వెడల్పు వెనక భంగిమ: పునః రూపకల్పన చేయబడిన వెనక విభాగం శ్రేణిలో వెడల్పు రియర్ టైర్లలో ఒకటిగా నిలిచింది,మోటార్ సైకిల్ కు స్థిరమైన మరియు ఆధిపత్యంవహించే రోడ్డు ఉనికిని ఇచ్చింది.
తగ్గించబడిన రియర్ ఫెండర్ : ఒక బిగుతైన , టైర్ ను హత్తుకున్న రియర్ ఫెండర్ తక్కువ ఎత్తు గల రూపాన్ని మరింత మెరుగుపరుస్తుంది, సింగిల్ సీటుతో జోడించినప్పుడు, శుద్ధి చేయబడిన బొబ్బర్ వంటి అందాన్ని అందిస్తుంది.
అవార్డ్ గెలుపొందిన డిజైన్ సూత్రం షాడో బ్లాక్ ఎడిషన్ లో సూచించబడింది, ఇది రోడ్ స్టర్ యొక్క అత్యంతగా కోరుకునే వేరియెంట్లలో ఒకటి. బాహ్యంగా కనిపించే భాగాలను నిరోధించడానికి బదులుగా, డిజైన్ టీమ్ నిజమైన పూర్తి నలుపు రంగు అందం ఇవ్వడానికి దృష్టి కేంద్రీకరించారు, మోటార్ సైకిల్ లో క్రోమ్ మరియు సిల్వర్ అంశాలను జాగ్రత్తగా తొలగించడం నుండి ఫ్యూయల్ క్యాప్స్ మరియు హార్డ్ వేర్ ఫినిషింగ్ వంటి చిన్న వివరాలు తొలగించడం వరకు ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా ఎన్నో మోటార్ సైకిల్స్ ఇప్పటికీ బయటకు కనిపించే లోహపు అంశాలనే కలిగిన శ్రేణిలోనే అత్యంత ఆధునికమైన , ప్రశాంతమైన రూపం అరుదుగా సాధించబడింది.
దీని దృఢమైన నిష్పత్తులు,ఆలోచనాత్మకమైన మాడ్యులారిటి మరియు వివరాలకు నిర్భయమైన శ్రద్ధలతో, క్లాసిక్ మోటార్ సైకిల్స్ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించగలవు అని మరియు ఆ డిజైన్ ఆవిష్కరణ తరచుగా ఒక మెషీన్ యొక్క రూపం, నిష్పత్తులు మరియు వినియోగతలపై ఆధారపడిందని యెజ్డీ రోడ్ స్టర్ నిరూపించింది. రైడర్స్ తమ వ్యక్తిత్వం ఆధారంగా మోటార్ సైకిల్ ను తీర్చిదిద్దేలా చేయడం ద్వారా యెజ్డీ యొక్క సాహసవంతమైన మరియు హుషారైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించేలా ‘బోర్న్ అవుట్ ఆఫ్ లైన్’ మోటార్ సైకిల్ అవకాశం ఇస్తుంది మరియు ఇది దేశవ్యాప్తంగా ఉన్న అథీకృత డీలర్ షిప్స్ లో రూ. 196,000కి (ఎక్స్-షోరూం)లభిస్తోంది.
ప్రతి రైడర్ కోసం యాజమాన్య హామీ కార్యక్రమం
యెజ్డీ రోడ్ స్టర్ కు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ యొక్క పరిశ్రమలో మొదటి యాజమాన్య హామీ కార్యక్రమం మద్దతు ఇస్తుంది. ఇది కస్టమర్ సంతృప్తి మరియు ఇబ్బంది లేని యాజమాన్యానికి ప్రాధాన్యతనిస్తుంది. దీనిలో ఇవి భాగంగా ఉన్నాయి :
4- సంవత్సరాలు /50,000-కిమీ స్టాండర్డ్ వారంటీ*
6 సంవత్సరాల వరకు దీర్ఘకాలం వారంటీ ఎంపికలు*
8 సంవత్సరాల వరకు రోడ్ సైడ్ సహాయం*
దేశవ్యాప్తంగా కవరేజ్ తో 5 సంవత్సరాల వరకు AMC*
దేశవ్యాప్తంగా 450+ సేల్స్ మరియు సర్వీస్ టచ్ పాయింట్స్ లో సమగ్రమైన యాజమాన్య ప్రయోజనాలు ఉపలబ్దం
*షరతులు వర్తిస్తాయి.