1 లక్ష బుకింగ్స్ మైలురాయిని అధిగమించిన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఈ రోజు తన డైనమిక్ మరియు ట్రెండ్‌సెట్టింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) - సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కోసం 1 లక్ష బుకింగ్‌ల భారీ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) ఈ రోజు తన డైనమిక్ మరియు ట్రెండ్‌సెట్టింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) - సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కోసం 1 లక్ష బుకింగ్‌ల భారీ మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూ.. ఆధునిక భారతీయ కస్టమర్లకు మెరుగైన సౌకర్యాన్ని, పనితీరును అందించే కొత్త 'HX8 డీజిల్ ఆటోమేటిక్ (AT)' వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అద్భుతమైన పనితీరుతో పాటు సునాయాసమైన ప్రయాణాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ కొత్త HX8 డీజిల్ AT వేరియంట్ రాక.. హ్యుందాయ్ వెన్యూను మరింత చేరువ చేస్తుంది.
6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించబడిన నిరూపితమైన U2 1.5L CRDi డీజిల్ ఇంజిన్‌తో నడిచే ఈ కొత్త వేరియంట్.. అధునాతన సాంకేతికత, మెరుగైన సౌకర్యం మరియు అద్భుతమైన పనితీరును అందిస్తుంది. హుందాగల మరియు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే వినియోగదారులకు హ్యుందాయ్ వెన్యూ ఆకర్షణను ఇది మరింత పెంచుతుంది.
కొత్త HX8 డీజిల్ AT వేరియంట్ అనేక అప్‌గ్రేడ్ చేయబడిన సౌకర్యవంతమైన, భద్రతాపరమైన మరియు అనుకూలమైన ఫీచర్లతో వస్తుంది. వాటిలో:
ఫ్రంట్ రో (ముందు వరుస) వెంటిలేటెడ్ సీట్లు
వెన్యూ (VENUE) బ్రాండింగ్‌తో డ్యూయల్ టోన్ లెదరెట్ సీట్లు
ఎలక్ట్రిక్ 4-వే డ్రైవర్ సీట్ అడ్జస్ట్
కంట్రోలర్ ఓవర్-ది-ఎయిర్ (OTA) వెహికల్ అప్‌డేట్స్
హ్యుందాయ్ బ్లూలింక్ (కనెక్టెడ్ కార్ టెక్నాలజీ)
ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
వెనుక డిస్క్ బ్రేక్‌లు
యాంబియంట్ లైటింగ్ – క్రాష్ ప్యాడ్ & సెంట్రల్ కన్సోల్
డ్రైవ్ మోడ్స్ సెలెక్ట్ (ఎకో, నార్మల్, స్పోర్ట్)
ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ (సాండ్, మడ్, స్నో)
ప్యాడిల్ షిఫ్టర్లు
1 లక్ష బుకింగ్‌ల మైలురాయిని సాధించడం మరియు కొత్త HX8 డీజిల్ AT వేరియంట్ పరిచయం గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ తరుణ్ గర్గ్ మాట్లాడుతూ.. “కొత్త హ్యుందాయ్ వెన్యూ 1 లక్ష బుకింగ్‌లను దాటడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్రాండ్‌పై భారతీయ కస్టమర్లకు ఉన్న బలమైన నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. స్మార్ట్, కనెక్టెడ్ మరియు ఫీచర్-రిచ్ మొబిలిటీ సొల్యూషన్స్ (వాహనాల) పట్ల పెరుగుతున్న ఆకాంక్షలను ఈ మైలురాయి ప్రతిబింబిస్తుంది. కొత్త HX8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ పరిచయం వెన్యూ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది వినియోగదారులకు డీజిల్ ఎఫిషియెన్సీ, టార్క్-రిచ్ పెర్ఫార్మెన్స్ మరియు సునాయాసమైన సౌలభ్యంల అద్భుతమైన కలయికను అందిస్తుంది. అధునాతన సాంకేతికత మరియు అత్యుత్తమ విలువతో కూడిన అర్థవంతమైన ఎంపికలను అందించడంలో మా నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది. మారుతున్న కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా మరియు భారతదేశంలో మొబిలిటీ యొక్క తదుపరి దశను నడిపించే ఫ్యూచర్-రెడీ ఉత్పత్తులను అందించడంపై హ్యుందాయ్ ఎల్లప్పుడూ దృష్టి పెడుతుంది,” అని అన్నారు.
దేశంలో హ్యుందాయ్ యొక్క విస్తృతమైన సేల్స్ మరియు సర్వీస్ నెట్‌వర్క్ మద్దతుతో, ఫీచర్-రిచ్, సౌకర్యవంతమైన మరియు ఫ్యూచర్-రెడీ కాంపాక్ట్ SUV కోసం చూస్తున్న కస్టమర్లకు హ్యుందాయ్ వెన్యూ ఒక బలమైన ఆకర్షణగా నిలుస్తుంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కస్టమర్లకు అధునాతన సాంకేతికత, భద్రత, సౌకర్యం మరియు విలువతో కూడిన అద్భుతమైన కలయికను అందించడానికి కట్టుబడి ఉంది, అదే సమయంలో మారుతున్న కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నిరంతరం మెరుగుపరుచుకుంటోంది.
మరిన్ని వివరాల కోసం hyundai.co.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి.