నడుస్తూ కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై

Telangana Governor Tamilisai falls while walking. తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్..

By అంజి
Published on : 20 Feb 2023 11:26 AM IST

నడుస్తూ కిందపడిపోయిన గవర్నర్ తమిళిసై

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్.. ఓ కార్యక్రమంలో కాలు అదుపుతప్పి కిందపడిపోయారు. చెంగల్‌పట్టు జిల్లా పత్తిపులం గ్రామంలో హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రవేశద్వారం వద్ద గ్రీన్ కార్పెట్‌పై జారిపడ్డారు. మార్గమధ్యంలో రెడ్ కార్పెట్‌లు సరిగా వేయకపోవడంతో నడుచుకుంటూ వెళ్తున్న తమిళిసై సౌందర్‌రాజన్‌ జారి పడిపోయారు. సమీపంలోని సెక్యూరిటీ గార్డులు వెంటనే గవర్నర్‌ను పైకి లేపారు.

కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ ఘటనలో ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై గవర్నర్‌ మాట్లాడారు. తనకు ఎలాంటి గాయాలు కాకపోయినా తాను కింద పడిపోయినందుకు మీడియాలో ఈ న్యూస్‌ హైలైట్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత గవర్నర్ తమిళిసై అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Next Story