గ‌న్ వాడేవాళ్ల‌కు గ‌న్‌తోనే జవాబివ్వాలి.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Tamil Nadu Governor RN Ravi sensational comments. గ‌న్ వాడేవాళ్ల‌కు గ‌న్‌తోనే స‌మాధానం ఇవ్వాలి అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్‌ ఎన్ రవి సంచలన కామెంట్స్ చేశారు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో

By అంజి  Published on  1 Aug 2022 7:15 AM GMT
గ‌న్ వాడేవాళ్ల‌కు గ‌న్‌తోనే జవాబివ్వాలి.. గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

గ‌న్ వాడేవాళ్ల‌కు గ‌న్‌తోనే స‌మాధానం ఇవ్వాలి అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్‌ ఎన్ రవి సంచలన కామెంట్స్ చేశారు. కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో 'అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు' అనే అంశంపై ఆయన మాట్లాడారు. మాజీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్‌ తీరును ఆయన ఖండించారు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత పాకిస్తాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఉగ్రవాద ఒప్పందాన్ని గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి తప్పుబట్టారు. ముంబై పేలుళ్లతో దేశం విషాదంలో నిండిపోయిందని, కానీ ఘటన జరిగి 9 నెలలు కాకముందే ఉగ్రవాద బాధితులమని రెండు దేశాల ప్రధానులు సంతకాలు చేసినట్లు ఆరోపించారు.

పాకిస్థాన్ మ‌న‌కు మిత్ర దేశ‌మా లేక శత్రు దేశ‌మా, ఈ అంశంలో క్లారిటీ ఉండాల‌ని, క‌న్ఫ్యూజ‌న్ ఉండ‌కూడ‌ద‌ని గవర్నర్ అన్నారు. పూల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్‌ను గవర్నర్ మెచ్చుకున్నారు. ఎవరైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ పాలనతో పోలిస్తే.. ఇప్పుడు అంతర్గత భద్రత చాలా మెరుగ్గా ఉందన్నారు. మన్మోహన్ హయాంలో మావో తీవ్ర‌వాదుల హింస 185 జిల్లాల్లో ఉండేద‌ని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాల‌కు త‌గ్గిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

ఇంకా క‌శ్మీర్ అంశంపై గవర్నర్ రవి మాట్లాడారు. ప్ర‌జ‌లు స‌హ‌క‌రించ‌డం వ‌ల్లే ఉగ్ర‌వాద నిర్మూల‌న సాధ్యం అవుతోంద‌ని తెలిపారు. హింస ప‌ట్ల జీరో టాల‌రెన్స్ ఉంద‌ని, ఎవ‌రైనా గ‌న్ వాడితే వాళ్ల‌కు ఆ గ‌న్‌తోనే స‌మాధానం ఇవ్వాల‌న్నారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌కు వ్య‌తిరేకంగా మాట్లాడేవారితో చ‌ర్చ‌లు ఉండ‌వ‌ని, గ‌డిచిన 8 ఏళ్ల‌లో ఎటువంటి సాయుధ గ్రూపుతో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌లేద‌ని గవర్నర్ వెల్ల‌డించారు. మావో ప్రాంతాల్లోని వాళ్ల‌కు ప్ర‌త్యేక ఐడియాల‌జీ ఉంటుందని, వాళ్లు పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్య విధానాన్ని న‌మ్మ‌ర‌ని, అయితే తాము దాన్ని అంగీక‌రించ‌బోమ‌న్నారు.

Next Story
Share it