2025 SNAP టెస్ట్ 2025 ద్వారా MBA అడ్మిషన్లు ప్రారంభించిన సింబయాసిస్

అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) MBA అభ్యర్థుల కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన సింబియోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ (SNAP) టెస్ట్ 2025 కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 10 Aug 2025 5:30 PM IST

2025 SNAP టెస్ట్ 2025 ద్వారా MBA అడ్మిషన్లు ప్రారంభించిన సింబయాసిస్

అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు కలిగిన సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) MBA అభ్యర్థుల కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అయిన సింబియోసిస్ నేషనల్ ఆప్టిట్యూడ్ (SNAP) టెస్ట్ 2025 కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 5 దశాబ్దాలకు పైగా విద్యా నైపుణ్యం కలిగినటువంటి యూనివర్శిటీ సింబయాసిస్. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అనుగుణంగా మరియు విద్యాపరంగా కఠినమైన నిర్వహణ విద్యను కోరుకునే విద్యార్థులకు సింబయాసిస్ అద్భుతమైన మరియు నెంబర్ వన్ ఎంపికగా ఉంది.

SNAP 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. పేమెంట్ విండో ఆగస్టు 1, 2025 (శుక్రవారం)న ప్రారంభమైంది. నవంబర్ 20, 2025 (గురువారం)న ముగుస్తుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మూడు తేదీల్లో నిర్వహించబడుతుంది, అభ్యర్థులు మూడు సార్లు పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది. ఉత్తమ స్కోరును ప్రవేశ ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు.

పరీక్ష తేదీలు:

- SNAP పరీక్ష 01: డిసెంబర్ 6, 2025 (శనివారం)

- SNAP పరీక్ష 02: డిసెంబర్ 14, 2025 (ఆదివారం)

- SNAP పరీక్ష 03: డిసెంబర్ 20, 2025 (శనివారం)

ఫలితాల ప్రకటన: జనవరి 9, 2026 (శుక్రవారం)

SNAP 2025 పరీక్ష భారతదేశంలోని 79 నగరాల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్కటి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 25% నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ ఫీజు ప్రతి ప్రయత్నానికి రూ. 2,250, ప్రతి ప్రోగ్రామ్‌కు అదనంగా రూ. 1,000 చెల్లించాలి.ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ (మెరిట్ లిస్టింగ్) మిశ్రమ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది, ఇందులో ఇవి ఉంటాయి:

- SNAP స్కోర్ (50 మార్కులకు స్కేల్ చేయబడింది)

- గ్రూప్ ఎక్సర్‌సైజ్ (10 మార్కులు)

- పర్సనల్ ఇంటరాక్షన్ (40 మార్కులు)

మొత్తం: 100 మార్కులు

ఇక ఈ పరీక్షకు అర్హత విషయానికి వస్తే... అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ నుండి కనీసం 50% మార్కులతో (SC/STలకు 45%) బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. విదేశీ అర్హతలు ఉన్న అభ్యర్థులు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (AIU) నుండి సమానత్వ ధృవీకరణ పత్రాన్ని పొందాలి. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో నిర్దిష్ట ప్రోగ్రామ్ అర్హతను తనిఖీ చేయాలని అభ్యర్థులను కోరుతున్నాం.

“సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) నేటి డైనమిక్ వ్యాపార ప్రపంచంలో విజయానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు విలువలను కలిగి ఉన్న ప్రపంచవ్యాప్తంగా సమర్థులైన నాయకులను పెంపొందించడానికి కట్టుబడి ఉంది. ప్రతిష్టాత్మకమైన సింబయాసిస్ సంస్థలలోని మా ప్రీమియర్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందడానికి ఆశావహులైన విద్యార్థులకు SNAP పరీక్ష కీలకమైన గేట్‌వేగా పనిచేస్తుంది. అని అన్నారు సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ రామకృష్ణన్ రామన్.

SNAP పరీక్ష MBA ప్రోగ్రామ్‌లకు అద్భుతమైన గేట్ వే: SIBM పూణే, SICSR, SIMC, SIIB, SCMHRD, SIMS, SIDTM, SCIT, SIOM, SIHS, SIBM బెంగళూరు, SSBF, SIBM హైదరాబాద్, SSSS, SIBM నాగ్‌పూర్, SIBM NOIDA, మరియు SSCANS.

అడ్మిట్ కార్డుల లభ్యత:

- SNAP 01: నవంబర్ 28, 2025 (శుక్రవారం)

- SNAP 02: డిసెంబర్ 8, 2025 (సోమవారం)

- SNAP 03: డిసెంబర్ 15, 2025 (సోమవారం)

అన్ని అధికారిక కమ్యూనికేషన్ దీని ద్వారా జరుగుతుంది:

📧 info@snaptest.org / no-reply@snaptest.org

సింబియాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ) UGC ద్వారా కేటగిరీ-I హోదాను పొందింది. NAAC నుండి ‘A++’ గ్రేడ్‌ను కలిగి ఉంది. ఈ విశ్వవిద్యాలయం NIRF 2024 విశ్వవిద్యాలయాల విభాగంలో భారతదేశంలో 31వ స్థానంలో మరియు ARIIA 2021లో 10వ స్థానంలో ఉంది. QS ఇండియా ర్యాంకింగ్స్ ప్రకారం, ఇది భారతదేశంలో రెండవ అత్యుత్తమ ప్రైవేట్ విశ్వవిద్యాలయం. క్యాంపస్‌లు పూణే, హైదరాబాద్, నాగ్‌పూర్, నాసిక్, నోయిడా మరియు బెంగళూరులో ఉన్నాయి.

మీ SNAP 2025 రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించడానికి మరియు సింబయాసిస్ యొక్క నిర్వహణ కార్యక్రమాలను అన్వేషించడానికి, సందర్శించండి:

🌐 www.snaptest.org

Next Story