ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఆఫ్ హానర్ 2025ను అందుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ ప్లాంట్
భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిష్కార ప్రదాతలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్), పనిప్రదేశాలలో భద్రత పరంగా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
భారతదేశంలోని ప్రముఖ వ్యవసాయ పరిష్కార ప్రదాతలలో ఒకటైన కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (సిఐఎల్), పనిప్రదేశాలలో భద్రత పరంగా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. దీని కాకినాడ ప్లాంట్‌కు బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క స్వోర్డ్ ఆఫ్ హానర్ 2025 అవార్డు లభించింది. ఆరోగ్యం, భద్రత, సంక్షేమంలో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పిన సంస్థలకు లభించే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపులలో ఇది ఒకటి.
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం, లండన్‌లోని చారిత్రాత్మక డ్రేపర్స్ హాల్‌లో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన భద్రత మరియు ఉద్యోగుల శ్రేయస్సు పరంగా అత్యున్నత ప్రమాణాలను ప్రదర్శించే ప్రముఖ సంస్థలను ఈ కార్యక్రమం ఒకచోట చేర్చింది.
కోరమాండల్ తరపున కాకినాడ యూనిట్ సీనియర్ ఏవిపి& మాన్యుఫాక్చరింగ్ హెడ్ కె. జగన్నాథన్; వైజాగ్ ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ & మాన్యుఫాక్చరింగ్ హెడ్ సిహెచ్. శ్రీనివాసరావు; మరియు కాకినాడ యూనిట్ ఈహెచ్ఎస్ డిజిఎం పి . గణేష్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ ప్రపంచ గుర్తింపు అందుకోవటానికి ప్రయాణం జూన్ 2023లో ప్రారంభమైంది. కాకినాడ యూనిట్ బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క కఠినమైన ఫైవ్-స్టార్ ఆడిట్ కార్యక్రమాన్ని చేపట్టింది. బలమైన నాయకత్వ నిబద్ధత, చురుకైన శ్రామిక శక్తి అనుసంధానిత , నిరంతర శిక్షణ మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా, ఈ ప్లాంట్ 2024లో రెండుసార్లు మరియు 2025లో మరోసారి ఫైవ్-స్టార్ సర్టిఫికేషన్‌ను సాధించింది - ప్రతిష్టాత్మకమైన స్వోర్డ్ ఆఫ్ హానర్ కు అర్హత సాధించింది.
దేశంలోని అతిపెద్ద ఫాస్ఫాటిక్ ఎరువుల కేంద్రాలలో కోరమాండల్ యొక్క కాకినాడ ప్లాంట్ ఒకటి. సంక్లిష్టమైన రసాయన శాస్త్రాలను ఇది నిర్వహిస్తుంది. ఈ ప్రదేశం పక్షుల అభయారణ్యం కలిగి ఉంది, ఇది 100 కంటే ఎక్కువ జాతుల వలస పక్షులకు ఆశ్రయం కల్పిస్తుంది.
ఈ అవార్డు అందుకున్న సందర్భంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమీర్ అల్వి మాట్లాడుతూ, “సురక్షితమైన మరియు భద్రతతో కూడిన కార్యాలయాన్ని పెంపొందించడంలో మా అచంచలమైన నిబద్ధతను ఈ అవార్డు నొక్కి చెబుతుంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మా కాకినాడ ప్లాంట్ యొక్క స్థిరమైన పనితీరు, ఆరోగ్యం, భద్రత , శ్రేయస్సు మా కార్యకలాపాల యొక్క ప్రతి అంశంలో లోతుగా విలీనం చేయబడినప్పుడు స్థిరమైన వృద్ధిని సాధించవచ్చనే మా నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. మేము భద్రతా శ్రేష్ఠత కోసం మా ప్రయత్నాలను కొనసాగిస్తాము. పర్యావరణ అనుకూల పని ప్రదేశాలను మరియు బాధ్యతాయుతమైన ప్రపంచ తయారీ సంస్థను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాము ” అని అన్నారు.