రూ. 374 కోట్ల నికర లాభంతో మరో రికార్డు త్రైమాసికాన్ని నమోదు చేసిన సౌత్ ఇండియన్ బ్యాంక్

సౌత్ ఇండియన్ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి అత్యధిక త్రైమాసిక నికర లాభం రూ. 374.32 కోట్లను సాధించినట్లు వెల్లడించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 16 Jan 2026 9:14 PM IST

రూ. 374 కోట్ల నికర లాభంతో మరో రికార్డు త్రైమాసికాన్ని నమోదు చేసిన సౌత్ ఇండియన్ బ్యాంక్

సౌత్ ఇండియన్ బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి అత్యధిక త్రైమాసిక నికర లాభం రూ. 374.32 కోట్లను సాధించినట్లు వెల్లడించింది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో సాధించిన రూ. 341.87 కోట్లతో పోలిస్తే 9% వృద్ధిని నమోదు చేసింది.

2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికపు ప్రధాన ఆకర్షణలు:

• డిసెంబర్-25తో ముగిసిన 9 నెలల కాలానికి బ్యాంక్ నికర లాభం డిసెంబర్-24తో ముగిసిన కాలంతో పోలిస్తే 9% పెరిగి రూ. 1047.64 కోట్లకు చేరుకుంది.

• వడ్డీయేతర ఆదాయం రూ. 409.22 కోట్ల నుండి రూ. 485.93 కోట్లకు పెరిగింది, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 19% వృద్ధిని నమోదు చేసింది.

• స్థూల నిరర్థక ఆస్తులు (Gross NPA) ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో 163 బేసిస్ పాయింట్లు తగ్గి 4.30% నుండి 2.67%కి చేరాయి.

• నికర నిరర్థక ఆస్తులు (Net NPA) ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో 80 బేసిస్ పాయింట్లు తగ్గి 1.25% నుండి 0.45%కి చేరాయి. ఆస్తులపై రాబడి 1% కంటే ఎక్కువగా కొనసాగింది.

డిపాజిట్లు

రిటైల్ డిపాజిట్లు రూ. 1,02,421 కోట్ల నుండి రూ. 1,15,563 కోట్లకు అంటే రూ. 13,142 కోట్లు పెరిగాయి, ఇది ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో 13% పెరుగుదలను సూచిస్తుంది

అడ్వాన్సులు

స్థూల అడ్వాన్సులు రూ. 86,966 కోట్ల నుండి రూ. 96,764 కోట్లకు అంటే, రూ. 9,798 కోట్లు పెరిగాయి, ఇది ఇయర్ ఆన్ ఇయర్ పద్దతిలో 11% పెరుగుదలను సూచిస్తుంది

ఆర్థిక ఫలితాలను ప్రకటించిన బ్యాంక్ ఎండి & సీఈఓ శ్రీ పి . ఆర్ . శేషాద్రి మాట్లాడుతూ, ఈ కాలంలో బ్యాంకు యొక్క స్పష్టమైన వ్యూహం దాని బలమైన వ్యాపార పనితీరుకు ఆధారం గా నిలుస్తోంది. కార్పొరేట్, ఎంఎస్ఎంఈ , హౌసింగ్, ఆటో మరియు బంగారు రుణాలు వంటి అన్ని ప్రధాన విభాగాలలో బ్యాంక్ ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేసింది. నాణ్యమైన క్రెడిట్ వృద్ధి ద్వారా లాభదాయకతను సాధించాలనే బ్యాంక్ వ్యూహాత్మక లక్ష్యంకు అనుగుణంగా, బ్యాంక్ తక్కువ రిస్క్ ప్రొఫైల్‌తో కొత్త అడ్వాన్స్‌లను విజయవంతంగా ప్రవేశపెట్టిందని అన్నారు .

Next Story