చియాంగ్ రాయ్, ఒకినావా, టోక్యోలకు కొత్త మార్గాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నస్కూట్

భారతదేశం- సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) యొక్క తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్, ఈరోజు థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ మరియు జపాన్‌లోని ఒకినావా మరియు టోక్యో (హనేడా) లకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 18 Aug 2025 4:45 PM IST

చియాంగ్ రాయ్, ఒకినావా, టోక్యోలకు కొత్త మార్గాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తున్నస్కూట్

భారతదేశం- సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) యొక్క తక్కువ-ధర అనుబంధ సంస్థ అయిన స్కూట్, ఈరోజు థాయిలాండ్‌లోని చియాంగ్ రాయ్ మరియు జపాన్‌లోని ఒకినావా మరియు టోక్యో (హనేడా) లకు కొత్త విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విమానాలు డిసెంబర్ 2025 మరియు మార్చి 2026 మధ్య క్రమంగా ప్రారంభమవుతాయి, సంవత్సరాంతపు మరియు నూతన సంవత్సర ప్రయాణాలను ప్లాన్ చేసుకునే హాలిడే మేకర్లకు మరిన్ని ఎంపికలను అందిస్తాయి.

థాయిలాండ్ యొక్క ఉత్తర భాగంలో ఉన్న చియాంగ్ రాయ్ దాని పర్వత శోభ మరియు ప్రశాంత వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. లన్నా వారసత్వంలో లోతుగా పాతుకుపోయిన దాని జాతి జనాభా వివిధ కొండ తెగలతో విభిన్నంగా ఉంటుంది. దాని బహుళ సాంస్కృతికత ప్రావిన్స్ యొక్క కట్టడాలు, వంటకాలు మరియు కళలలో మరింత ప్రతిబింబిస్తుంది. స్కూట్ 2026 జనవరి 1న ఎంబ్రేర్ E190-E2 విమానంలో చియాంగ్ రాయ్‌కు వారానికి ఐదుసార్లు తిరిగే విమానాలను ప్రారంభిస్తుంది.

జపాన్ యొక్క ఉపఉష్ణమండల స్వర్గధామం అయిన ఒకినావా, దాని సహజమైన బీచ్‌లు, స్వచ్చమైన జలాలు మరియు ప్రత్యేకమైన ర్యుక్యూ వారసత్వానికి ప్రసిద్ధి చెందిన ద్వీపాల ద్వీపసమూహం. సాంస్కృతిక మరియు సహజమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలకు నిలయంగా ఉన్న ఒకినావా, దాని గొప్ప చరిత్ర మరియు ఆ ప్రాంతపు సహజ సౌందర్యంలో లీనమైపోయేలాచేస్తుంది. స్కూట్ టోక్యో (హనేడా)కి కూడా సేవలను ప్రారంభిస్తుంది, ఇది ప్రయాణికులకు జపాన్ యొక్క సందడిగా ఉండే రాజధానిని యాక్సెస్ చేయడానికి ప్రత్యామ్నాయ మరియు అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. ఒకినావాకు వారానికి మూడుసార్లు విమానాలు 2025 డిసెంబర్ 15న ఎయిర్‌బస్ A320 ఫ్యామిలీ విమానంలో ప్రారంభమవుతాయి, టోక్యో (హనేడా)కి రోజువారీ విమానాలు 2026 మార్చి 1న బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లలో ప్రారంభమవుతాయి.

వన్-వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు[1]టోక్యో (హనేడా) మరియు ఒకినావాకు INR17,500 నుండి ప్రారంభమవుతుంది మరియు చియాంగ్ రాయ్‌కు INR 10,500 నుండి ప్రారంభమవుతుంది. సింగపూర్ మీదుగానిరంతర కనెక్షన్లు ఉన్నందున, భారతీయ ప్రయాణికులు ఇప్పుడు స్కూట్‌తో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఈ కొత్త విమానాలు నేటి నుండి స్కూట్ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ ద్వారా మరియు క్రమంగా ఇతర మార్గాల ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి.

చియాంగ్ రాయ్, ఒకినావా మరియు టోక్యో (హనేడా) లకు సర్వీసులు ప్రారంభించడంతో, స్కూట్ థాయిలాండ్‌కు వారానికి 111 విమానాలను మరియు జపాన్‌కు వారానికి 45 విమానాలను నడుపుతుంది. దాని నెట్‌వర్క్‌కు కొత్త చేరికలతో, ఎయిర్‌లైన్ ఆసియా-పసిఫిక్, మధ్యప్రాచ్యం మరియు ఐరోపాలోని 18 దేశాలు మరియు భూభాగాలలో

76 గమ్యస్థానాలకు (సింగపూర్‌తో సహా) సేవలు అందిస్తుంది.

కొత్త గమ్యస్థానాలతో పాటు, రాబోయే సెలవు దినాలలో విమాన ప్రయాణానికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా స్కూట్ తన నెట్‌వర్క్‌లో విమానాల ఫ్రీక్వెన్సీలను పెంచనుంది.

ఆగ్నేయాసియాలో, బ్యాంకాక్‌కు విమానాలు ఆగస్టు 2025 నుండి వారానికి 35 నుండి 39 సార్లకు పెరిగాయి. ఇపోలో నవంబర్ 2025 నుండి వారానికి 17 నుండి 21 సార్లకు సేవలు పెరుగుతాయి. చియాంగ్ మాయిలో కూడా డిసెంబర్ 2025 నాటికి వారానికి ఏడు సార్లు నుండి వారానికి 14 సార్లకు ఫ్రీక్వెన్సీలు క్రమంగా పెరుగుతాయి.

ఉత్తర ఆసియాలో, టోక్యో (నరిటా) (తైపీ మీదుగా)కి సేవలు అక్టోబర్ 2025 నుండి వారానికి 12 సార్లు నుండి క్రమంగా 14 సార్లకు పెరుగుతాయి. సప్పోరోకు కుడా సేవలు (హక్కైడో) (తైపీమీదుగా) డిసెంబర్ 2025 నుండి వారానికి నాలుగు నుండి ఏడు సార్లకుపెరుగుతాయి. తదనుగుణంగా, సింగపూర్ మరియు తైపీ మధ్య సేవలు అక్టోబర్ 2025 నుండి క్రమంగా 23 నుండి 25 సార్లకు మరియు డిసెంబర్ 2025 నుండి 25 నుండి 28 సార్లకు పెరుగుతాయి. అదనంగా, జెజుకు విమానాలు జనవరి 2026 నుండి వారానికి ఐదు నుండి ఏడు సార్లకుపెరుగుతాయి.

యూరప్‌లో, మార్చి 2026 నుండి వియన్నాకు విమానాల రాకపోకలు వారానికి మూడు నుండి నాలుగు సార్లకుపెరుగుతాయి.

"చియాంగ్ రాయ్, ఒకినావా మరియు టోక్యో (హనేడా) లకు కొత్త మార్గాలతో ఆసియాలో స్కూట్ నెట్‌వర్క్‌ను విస్తరించడం పట్ల మేము సంతోషిస్తున్నాము, ఇది మా వినియోగదారులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందిస్తుంది. అదనంగా, కొన్ని నగరాలకు రాబోయే సేవల పెరుగుదల సంవత్సరాంతపు మరియు నూతన సంవత్సర సెలవుల కాలంలో విమాన ప్రయాణాలకు బలమైన డిమాండ్‌నుతట్టుకునేలా ఉంటుంది. స్కూట్‌తో మా కస్టమర్‌లను కొత్త ప్రయాణ అనుభవాలు మరియు చిరస్మరణీయ ప్రయాణాలకు కనెక్ట్ చేయడానికి మేము అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటాము" అని స్కూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ లెస్లీ థంగ్ అన్నారు.

విమాన షెడ్యూల్‌లు ప్రభుత్వం మరియు నియంత్రణ ఆమోదాలు లేదా మార్పులకు లోబడి ఉంటాయి. విమాన షెడ్యూల్‌ల గురించి మరింత సమాచారం కోసం, దయచేసి www.flyscoot.comను సందర్శించండి.

Next Story