భారత మహిళా క్రికెట్ జట్టుతో 'మీట్ & గ్రీట్' కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్‌బిఐ లైఫ్, బీసీసీఐ
ఆర్థిక రక్షణకు మించి కలలను సాకారం చేయటంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే జీవిత బీమా సంస్థలలో ఒకటి కావటంతో పాటుగా బీసీసీఐ యొక్క అధికారిక భాగస్వామి అయిన ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోల్‌కతాలోని ఉదయన్ ఎన్జిఓ కు చెందిన ఐదుగురు బాలికల కోసం విశాఖపట్నంలోని ఏసిఏ –విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
ఆర్థిక రక్షణకు మించి కలలను సాకారం చేయటంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే జీవిత బీమా సంస్థలలో ఒకటి కావటంతో పాటుగా బీసీసీఐ యొక్క అధికారిక భాగస్వామి అయిన ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోల్‌కతాలోని ఉదయన్ ఎన్జిఓ కు చెందిన ఐదుగురు బాలికల కోసం విశాఖపట్నంలోని ఏసిఏ –విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక మీట్ & గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జాతీయ మహిళా క్రికెట్ జట్టు సభ్యులతో ముఖాముఖి సంభాషించడానికి ఈ ఐదుగురికి అరుదైన మరియు స్ఫూర్తిదాయకమైన అవకాశాన్ని అందించింది.
ఉదయన్ ఎన్జిఓ నుండి వచ్చిన ఐదుగురు బాలికలు - సుపర్ణ మహతో (9); ఏంజెల్ బౌరి (10); రోష్ని కర్మాకర్ (10); మినాటి బాస్కీ (10); అనురాధ మండి (11) భారత మహిళల క్రికెట్ జట్టులోని అత్యంత ప్రసిద్ధ క్రీడాకారిణులతో ముచ్చటిస్తూ ఒక మరపురాని రోజును గడిపారు. ఈ క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ్ రాణా, షఫాలి వర్మ & హర్లీన్ డియోల్ వంటి వారు వున్నారు. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు బీసీసీఐ నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో ఈ బాలికలు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మహిళా క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ నెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలికలు, ప్రపంచ ఛాంపియన్‌ల మధ్య నవ్వులు, హర్ష ధ్వానాలు మరియు హృదయపూర్వక సంభాషణలు ఈ రోజును నిజంగా చిరస్మరణీయంగా మార్చాయి. బాలికలపై శాశ్వత ముద్ర వేశాయి. ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో తమ ఆశయాలను కొనసాగించడానికి వారిని ప్రేరేపించాయి.
ఎస్‌బిఐ లైఫ్ యొక్క కొనసాగుతున్న కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పేద పిల్లలకు విద్య, సమగ్ర అభివృద్ధి, ముఖ్యంగా వారి కలలకు మద్దతు ఇవ్వడం ద్వారా వారిని తీర్చిదిద్దుతుంది. జాతీయ క్రీడా దిగ్గజాలను కలుసుకునే అవకాశం ఈ బాలికలకు అందించటం ద్వారా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, ఆకాంక్షలను విస్తృతం చేయడం మరియు ఏ కల కూడా పెద్దది కాదనే నమ్మకాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ మరియు సిఎస్‌ఆర్ చీఫ్ రవీంద్ర శర్మ మాట్లాడుతూ, “ఎస్‌బిఐ లైఫ్ వద్ద , నిజమైన సాధికారత అనేది ఆర్థిక భద్రతకు మించినదని - అది కలలను పోషించడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, ధైర్యాన్ని ప్రేరేపించడం అని మేము నమ్ముతున్నాము. ఈ బాలికలకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభవాన్ని సృష్టించడం మాకు గర్వకారణం. భారత మహిళల క్రికెట్ జట్టుతో నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం, వారికి తమ రోల్ మోడల్స్ తో సంభాషించడానికి, తమ ఆశయాలు నిజమవ్వడాన్ని చూడటానికి మరియు నిర్భయంగా కలలు కనవచ్చనే సందేశాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ బాలికలతో అర్థవంతంగా గడపడానికి సమయం కేటాయించిన క్రీడాకారిణులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాంటి క్షణాలు ఆశయాలను తీర్చిదిద్దడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి, ప్రతి చిన్నారికి వారి కలలు సాధ్యమేనని, వాటిని సాధించడానికి కృషి చేయవచ్చని గుర్తు చేయడానికి శక్తిని కలిగి ఉంటాయి” అని అన్నారు
ఉదయన్ సంస్థ డైరెక్టర్, కె ఎల్ జార్జ్ మాట్లాడుతూ, “ఉదయన్‌లోని పిల్లలకు చాలా కాలంగా ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండగా నిలుస్తోంది. ఇలాంటి అవకాశాలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని మరియు భవిష్యత్తు పట్ల వారి దృక్పథాన్ని తీర్చిదిద్దడంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తాయి. ఎస్‌బిఐ లైఫ్ భారత మహిళల క్రికెట్ జట్టుతో ఏర్పాటు చేసిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మా అమ్మాయిలకు స్ఫూర్తిదాయకమైన ఆదర్శప్రాయులను పరిచయం చేసింది, వారికి సాధారణంగా లభించని అనుభవాలను అందించింది. ఈ బాలికలు తమను తాము విశ్వసించడానికి, తమ ఆకాంక్షలను కొనసాగించడానికి, ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం పనిచేయడానికి ప్రేరేపించే క్షణాన్ని సృష్టించినందుకు, ఆలోచనాత్మక మద్దతు అందించినందుకు ఎస్‌బిఐ లైఫ్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము”అని అన్నారు.