నడిరోడ్డుపై ప్లాస్టిక్‌ బ్యాగులో శిశువు.. వాహనాలు దూసుకెళ్లడంతో చిద్రమై..

ప్లాస్టిక్ సంచిలో చుట్టబడి ఉన్న నవజాత శిశువును పలు వాహనాలు ఢీకొన్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

By అంజి  Published on  5 March 2023 4:05 PM IST
Bengaluru,Infant,Newborn

నడిరోడ్డుపై ప్లాస్టిక్‌ బ్యాగులో శిశువు (ఫైల్‌ ఫొటో)

కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్ సంచిలో చుట్టబడి ఉన్న నవజాత శిశువును పలు వాహనాలు ఢీకొన్న దిగ్భ్రాంతికరమైన సంఘటన బెంగళూరులో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటన బెంగళూరులోని అమృతహళ్లిలోని పంపా లేఅవుట్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు నుంచి ఐదు నెలల వయసున్న పాపను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బీబీఎంపీ చెత్త ట్రక్కులో పడేశారు.

అయితే పాప ఉన్న బ్యాగ్ లారీపై నుంచి కిందపడటంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు.. ఆ బ్యాగుపై నుంచి పరుగులు తీశాయి. మృతదేహం ఛిద్రమై ఉండడంతో అది మగపిల్లా, ఆడపిల్లా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. పుట్టిన విషయాన్ని దాచిపెట్టేందుకే నిందితులు శిశువును వదిలి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. లోపల మృతదేహంతో ఉన్న కవర్‌ను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story