బెంగళూరులోని సర్జాపూర్ వద్ద మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్

Muzigal launches its state of the art music academy in sarjapur bangalore. భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్, ముజిగల్ తమ ఐదవ అత్యాధునిక సంగీత

By Medi Samrat  Published on  31 May 2023 4:45 PM IST
బెంగళూరులోని సర్జాపూర్ వద్ద మ్యూజిక్ అకాడమీని ప్రారంభించిన ముజిగల్

భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్, ముజిగల్ తమ ఐదవ అత్యాధునిక సంగీత అకాడమీని బెంగళూరులో ప్రారంభించింది. బెంగళూరులోని సర్జాపూర్‌లో ఉన్న అకాడమీ దాదాపు 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా గాత్రం మరియు వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది.

దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్ , వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు.

ముజిగల్ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ " సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్ అకాడమీ తీర్చిదిద్దాము. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుంది. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం మరియు బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది. భారతీయ శాస్త్రీయ మరియు పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా, అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్ (బోధనాంశాలు), పీరియాడిక్ ఎస్సెస్‌మెంట్స్, సర్టిఫికేషన్, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచాము'' అని అన్నారు.


Next Story