రోడ్లపై దూసుకెళ్తున్న వింత వాహనం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Man spots imported human-powered car in Bengaluru. బెంగుళూరును టెక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే.

By అంజి  Published on  24 Jan 2023 10:14 AM IST
రోడ్లపై దూసుకెళ్తున్న వింత వాహనం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

బెంగుళూరును టెక్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే వినూత్న వాహనాలు, కాన్సెప్ట్‌లు ఇక్కడి వీధుల్లో ప్రతిరోజూ చూడవచ్చు. ఇది సుస్థిరమైన రవాణా విధానమైనా, కష్టతరమైన పని చేసే తెలివితేటల బెంగళూరు ఒక మార్గం. తాజాగా బెంగళూరు వీధుల్లో ఓ ఇన్నోవేటివ్‌ వెహికల్‌ వాహనదారుల దృష్టిని ఆకర్షించింది. ఆ ప్రత్యేకమైన వాహనం నగర రోడ్లపై తిరుగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో నెటిజన్లనూ తెగ ఆకట్టుకుంటోంది.

రేవంత్ అనే నెటిజన్ ఈ వాహనం వీడియోను, ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. జేపీ నగర్ దగ్గర ఈ వాహనదారుడిని కలిశానని, నెదర్లాండ్స్ నుండి ఈ వాహనాన్ని దిగుమతి చేసుకున్నారని, ఇది హ్యూమన్‌ పవర్డ్‌ వెహికల్‌ అని వీడియో క్యాప్షన్ ఇచ్చారు. ఒకే సీటు కలిగిన మూడు చక్రాల వింత వాహనం బెంగళూరు రోడ్లపై దూసుకెళ్తుండటం వీడియోలో కనిపించింది. ఈ వాహనాన్ని వెలోమొబైల్ అంటారు. ఈ వాహనం ఫనీష్ నాగరాజుకు చెందినది. ఇది సాధార‌ణ సైకిల్ త‌ర‌హాలో ఉంటుంది. దీనికి ప‌వ‌ర్ అసిస్టెన్స్‌, క‌న్వ‌ర్ష‌న్ ఉండ‌వ‌ని నాగ‌రాజ వివ‌రించారు.

ఈ వాహనంకు సంబంధించిన వీడియోను నెటిజన్లు ఆసక్తిగా తిలకించారు. తాము ఎప్పుడో ఒకసారి ఈ వాహనం నడపాలని పలువురు ఆకాంక్షించారు. అయితే వాహనం యుటిలిటీ గురించి ఇతరులు చాలా సందేహించారు. స్థానిక రోడ్ల‌పై ఈ వాహ‌నం ఎంతవరకు ప్రయాణించగలదన్న దానిపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story