ఎల్‌జీబీటీక్యూ అంటే మనందరికీ తెలిసిందే. మొదటి అక్షరం ఎల్.. అంటే లెస్బియన్ అని అర్థం. మహిళలకు మహిళలపై ప్రేమ కలగడం. వీరికి మగవారిపై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మహిళలతోనే కలిసి ఉండాలని వీరు కోరుకుంటారు. అందుకే వీరిని లెస్బియన్స్ అంటారు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ లెస్బియన్ కల్చర్ మన దేశంలోకి వస్తోంది. చాలా మంది లెస్బియన్స్ అంటే చిన్నచూపు చూస్తారు. అయితే వారికి ఓ మనసు ఉంటుంది. వారిని కుటుంబ సభ్యులు, సమాజం అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే సాగే ఓ వీడియో సాంగ్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.
మాగిళిని అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు ముక్తకంఠంతో ఈ పాటను స్వాగతించారు. పాట విడుదల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మగిజిని అంటే తమిళంలో ఆనందం లేదా తీపి ఆనందం. ఈ వీడియోలో గౌరీ జి కిషన్, అనఘ నటించారు. దీనికి VG బాలసుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ఇది నవంబర్ 22 న విడుదలైంది. అప్పటి నుండి 23 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చాలా ఆలోచనాత్మకంగా సెన్సిటివ్ టాపిక్‌పై వీడియో రూపొందించారు.