Q2FY26 ఫలితాలు ప్రకటించిన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (LGEIL) ఈ రోజు ఫలితాలు ప్రకటించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (LGEIL) ఈ రోజు ఫలితాలు ప్రకటించింది.
వేసవి కాలం చల్లగా ఉండటం + భౌగోళిక రాజకీయ పరిస్థితిలు మరియు ఫోరెక్స్ సవాళ్లు కారణంగా Q2-FY26 గణనీయంగా ప్రభావానికి గురైంది. అయినప్పటికీ వార్షిక ప్రాతిపదికన LG ఎలక్ట్రానిక్స్ ఇండియా రెవిన్యూ మరియు మార్కెట్-వాటా రెండిటిని పెంచింది.
మార్కెట్-వాటా వృద్ధి:
· TV 27% వృద్ధి (1.45 పెంపుదల)
· రిఫ్రిజిరేటర్లు 29.9% (1% పెరుగుదల)
· ACలు 17.3% (0.5% పెరుగుదల)
· వాషింగ్ మెషీన్లు 33.4% (ఫ్లాట్- క్షీణత లేదు లేదా పెంపుదల లేదు)
· మైక్రోవేవ్ ఓవెన్స్ 45$% (ఫ్లాట్- క్షీణత లేదు లేదా పెంపుదల లేదు)
పైన చెప్పిన డేటా ఆఫ్ లైన్ ఛానల్స్ లో మా మార్కెట్-వాటాకి నిర్దిష్టమైనది, ఇది పరిశ్రమ యొక్క ప్రాథమిక వృద్ధి ప్రేరేపక శక్తి మరియు దీని కోసం డేటా ఉపలబ్దం.
ఆసక్తికరంగా, రెండు ముఖ్యమైన విభాగాల్లో నంబర్ 2 భాగస్వామితో పోల్చినప్పుడు LG వారి నాయకత్వ అంతరం ఎప్పటి కంటే అధికంగా ఉంది:
· TV - 6.7%
· రిఫ్రిజిరేటర్లు - 6.2%
Q2FY26లో 8.9% లాభంతో Q2FY25 లో రూ. 61.14 బిలియన్స్ కార్యకలాపాలు ద్వారా కంపెనీ ఆదాయాన్ని అందించింది, ఇది Q2FY26లో రూ.61.74 బిలియన్స్ కార్యకలాపాలు ద్వారా వచ్చింది. సవాలుతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ, LGEIL స్థిరమైన ఉన్నతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ పెర్ఫార్మెన్స్ బ్రాండ్ లో కంపెనీ వారి అంతర్లీన శక్తి మరియు వినియోగదారు ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. కఠినమైన మార్కెట్ పరిస్థితులలో కంపెనీ పంపిణీదారులకు సహాయం చేయడానికి పెరుగుతున్న వస్తువుల ధరలు మరియు పండుగల సమయాల్లో గో-టు-మార్కెట్ కార్యక్రమాల్లో పెరుగుతున్న పెట్టుబడుల మిశ్రమ ప్రభావం ఫలితంగా EBITDA లాభం తగ్గుదల ఏర్పడింది.
LGEILకి రెండు వ్యాపార వర్గాలు ఉన్నాయి-హోమ్ అప్లయెన్సెస్ & ఎయిర్ సొల్యూషన్స్ (H&A) విభాగం మరియు హోమ్ ఎంటర్టైన్మెంట్ (HE) విభాగం. H&Aలో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ ఓవెన్స్, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లు, కంప్రెసర్స్, HVAC, వాటర్ ప్యూరిఫైర్లు మరియు ఎయిర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి. HE విభాగంలో టెలివిజన్లు (ఫ్లాట్ ప్యానల్, సైనేజీ, ప్రొజెక్టర్లు, మానిటర్ TV), ఆడియో విజువల్, మానిటర్లు మరియు వ్యక్తిగత కంప్యూటర్లు ఉన్నాయి.
H&A విభాగం Q2FY26లో తమ మార్కెట్ నాయకత్వాన్ని నిర్వహించింది, కీలకమైన శ్రేణుల్లో వృద్ధిని నమోదు చేసింది. GST సవరించబడిన రేటు ప్రకటన వినియోగదారు కొనుగోలును తాత్కాలికంగా వాయిదావేసింది, LGEIL వారి శక్తివంతమైన బ్రాండ్ ఈక్విటీ మరియు తట్టుకోగలిగిన సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ దాని ప్రీమియం మార్కెట్ వాటాను శక్తివంతం చేయడంలో సహాయపడింది. అక్టోబర్ లో పరిచయం చేయబడిన కొత్తగా ప్రారంభించబడిన LG ఎసన్షియల్ సీరీస్ కీలకమైన మార్కెట్లలో శక్తివంతంగా ప్రారంభపు ఆదరణను సంపాదిస్తున్నాయి. ఈ శ్రేణితో, LGEIL తమ ధరల శ్రేణిని మరింత విస్తరించింది మరియు ప్రవేశించని మార్కెట్లలో మొదటిసారి కొనుగోళ్లు చేస్తున్న వారితో శక్తివంతమైన సంబంధాలను రూపొందిస్తోంది. మరింత అభివృద్ధి సాధిస్తూ, ఇటీవలి GST రేటు తగ్గింపు మరియు పండగలు మరియు వివాహాల సమయంలో సీజనల్ డిమాండ్ లతో మద్దతు చేయబడిన, LGEIL అన్ని ఉత్పత్తి శ్రేణుల్లో భవిష్యత్తు వృద్ధి గురించి ఆత్మవిశ్వాసంతో ఉంది. శ్రేణి యొక్క ఆదాయం Q2FY25లో 39.53తో పోల్చినప్పుడు Q2FY26లో రూ.39.48 బిలియన్ లు ఆదాయంగా నిలిచింది.
HE శ్రేణి ఆదాయం Q2FY26తో పోల్చినప్పుడు వార్షికంగా 3% పెరిగింది, TV శ్రేణిలో పెరిగిన పండగ సీజన్ డిమాండ్ ద్వారా ప్రాథమికంగా మద్దతు చేయబడింది. భవిష్యత్తులో, LGEIL ఆవిష్కరణలను మరింత ముందుకు ప్రోత్సహించడం మరియు QNED మరియు OLED శ్రేణులతో సహా ప్రీమియం ఉత్పత్తి పోర్ట్ ఫోలియోలో దాని మార్కెట్ స్థానాన్ని పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్య, ఆతిధ్యం, వైద్య మరియు సంస్థాపరమైన పరిశ్రమలు వంటి రంగాల్లో భారతదేశపు పెరుగుతున్న మౌళిక సదుపాయాల నుండి పెరుగుతున్న అవకాశాలను సమన్వయం చేయడం ద్వారా తమ B2B ఉనికిని విస్తరించే ఉద్దేశ్యం కూడా కంపెనీకి ఉంది. శ్రేణి యొక్క ఆదాయాన్ని Q2FY25లో రూ.21.61 బిలియన్ లతో పోల్చినప్పుడు Q2FY26లో 22.26 బిలియన్ లుగా నిలిచింది.
అభివృద్ధి చెందే మార్గాన్ని పేర్కొంటూ, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ. హాంగ్ జు జియాన్ ఇలా అన్నారు, “2026 మొదటి త్రైమాసికంలో చల్లని వేసవి, భౌగోళిక రాజకీయ సవాళ్లు, సుంకాలు మరియు ఫారెక్స్ హెచ్చుతగ్గులు వంటి కొన్ని స్థూల ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ, భారతదేశంలో మా టీమ్ సహనశీలత కలిగిన సేల్స్ వృద్ధిని ప్రదర్శించింది, మార్కెట్ వాటాను సంపాదిస్తోంది మరియు స్థిరమైన లాభాన్ని నిర్వహిస్తోంది. ఈ పెర్ఫార్మెన్స్ మా కార్యకలాపాలు అమలు శక్తిని మరియు మా బ్రాండ్ లో వినియోగదారులు ఉంచిన లోతైన నమ్మకాన్ని సూచిస్తోంది. ఇది మా శక్తివంతమైన ప్రాధమికాంశాలను సూచిస్తోంది మరియు భారతదేశపు మా వృద్ధి కథకు మా నిరంతర నిబద్ధతను బలవర్ధకం చేస్తోంది. ప్రపంచ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఎగుమతులను పెంచడంపై దృష్టిసారించి మా డొమేస్టిక్ ఉనికిని విస్తరించడం ద్వారా మేము ఇప్పుడు మా భవిష్య వృద్ధిని వ్యూహాత్మకంగా పెంచుతున్నాము. మా మూడవ ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది మరియు మా కొత్త ఉత్పత్తి శ్రేణి, LG ఎసన్షియల్ సీరీస్ టియర్ 2 మరియు 3 మార్కెట్లలో మా వృద్ధిని మద్దతు చేస్తోంది. మా కేంద్రీకరణ స్పష్టంగా ఉంది: మా కస్టమర్ల జీవితాలను సుసంపన్నం చేసే ఆధునిక టెక్నాలజీని అందచేయడం మరియు భారతదేశం అత్యంత అభిమానించే బ్రాండ్ గా మా స్థానాన్ని దృఢతరం చేయడం.”
‘మేక్ ఫర్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇండియా గ్లోబల్’కి తమ నిబద్ధత ద్వారా, LGEIL తమ భారతదేశం-కేంద్రీయమైన పోర్ట్ ఫోలియోను విస్తరించడం కొనసాగిస్తోంది మరియు అంతర్జాతీయ ఆర్థిక నాయకునిగా తమ తలెత్తడానికి మద్దతును ఇస్తోంది. ‘మేక్ ఫర్ ఇండియా’ విషయంలో, భారతదేశపు జీవనశైలులకు ఉత్తమంగా సరిపోయే తయారీ ఉత్పత్తులకు విస్తృతమైన స్థానిక అంశాలతో అంతర్జాతీయ టెక్నాలజీని కంపెనీ కలుపుతోంది. ‘మేక్ ఇన్ ఇండియా’ విషయంలో, తమ తయారీ ఉనికిని విస్తరించడానికి LGEIL తమ మార్గంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తమ మూడవ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. ‘మేక్ ఇండియా గ్లోబల్’ ద్వారా, కంపెనీ తమ మాతృ సంస్థ యొక్క గ్లోబల్ సౌత్ వ్యూహంలో భాగంగా హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ లలో భారతదేశపు ఉత్పాదకతను పెంచుకునే మార్గాలను పరిశీలిస్తోంది.