కరీంనగర్ లో మెగా సిఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించిన కిస్నా
హరి కృష్ణ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక వజ్ర మరియు బంగారు ఆభరణాల బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ, నేడు కరీంనగర్ లోని కిస్నా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌లో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
హరి కృష్ణ గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక వజ్ర మరియు బంగారు ఆభరణాల బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ, నేడు కరీంనగర్ లోని కిస్నా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌లో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహించింది. వీటిలో భాగంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు , ఆహార పంపిణీ కార్యకలాపాలను రోజంతా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సౌత్ బిజినెస్ హెడ్ - సంతోష్ శర్మ ; సిఎస్ఆర్ నేషనల్ హెడ్ - ప్రియేష్ గమోత్ తో పాటుగా ఫ్రాంచైజ్ పార్టనర్స్, సాయి వరుణ్ & సాయి కృష్ణ ; మేనేజర్, సంతోష్ డెకొండ అర్రా తో పాటుగా కమ్యూనిటీ నాయకులు , సామాజిక ప్రతినిధులు, ఎన్ సి సి క్యాడెట్‌లు పాల్గొన్నారు. కరీంనగర్ తో పాటుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మధురై, విజయవాడ సహా దక్షిణ భారతదేశం వ్యాప్తంగా 19 కిస్నా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్‌లలో ఈ తరహా కార్యక్రమాలను నేడు నిర్వహించింది.
ఈ సందర్భంగా హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ “సమాజానికి తిరిగి ఇవ్వడమనేది కిస్నా సిద్దాంతంలో అంతర్భాగం. 'హర్ ఘర్ కిస్నా' అనే మా లక్ష్యంతో, మేము మా పరిధిని విస్తరించడానికి మాత్రమే కాకుండా సానుకూల సామాజిక ప్రభావాన్ని సృష్టించడానికి కూడా కట్టుబడి ఉన్నాము. ఈ మెగా సిఎస్ఆర్ కార్యక్రమం ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ , సమాజ శ్రేయస్సు దిశగా మా నిరంతర ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ సీఈఓ పరాగ్ షా మాట్లాడుతూ, “ తాము సేవలనందించే సమాజాలలో అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించడంలోనే నిజమైన వృద్ధి ఉందని కిస్నా వద్ద మేము విశ్వసిస్తున్నాము. ఈ మెగా సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక శ్రేయస్సుకు తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా బృందాలు , స్థానిక సంఘాలు చూపిన ఉత్సాహభరితమైన భాగస్వామ్యం , నిబద్ధత సమాజానికి తిరిగి ఇవ్వడం అనే మా ఉమ్మడి లక్ష్యంను ప్రతిబింబిస్తాయి" అని అన్నారు.
ప్రత్యేకమైన బ్రాండ్ అవుట్‌లెట్, భాగస్వాములు సాయి వరుణ్ గౌరిశెట్టి & సాయి కృష్ణ నార్ల మాట్లాడుతూ "వ్యాపార విజయంతో పాటు కమ్యూనిటీ ప్రభావానికి ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్‌లో భాగం కావడం నిజంగా స్ఫూర్తిదాయకం. మెగా సీఎస్ఆర్ డ్రైవ్ మా స్థానిక సమాజాలతో కనెక్ట్ అవ్వడానికి , వాణిజ్యంను మించి అర్థవంతంగా సహకరించడానికి అవకాశాన్ని అందించింది. సామాజిక బాధ్యత పట్ల కిస్నా యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది "అని అన్నారు.