జావా లేదా యెజ్డీ మోటార్ సైకిల్‌ను కేవలం రూ. 999కి ప్రీ-బుక్ చేయండి
ప్రపంచంలో అతి పెద్ద మోటార్ సైకిల్ మార్కెట్ లో GST 2.0 నుండి అత్యధికంగా లాభం సంపాదించిన వాటిలో ఒకటిగా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తన కొనుగోలుదారులు పండుగ కాలంలో తమకు ఇష్టమైన మోటార్ సైకిల్ డెలివరీ పొందడంలో ఉన్న సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
ప్రపంచంలో అతి పెద్ద మోటార్ సైకిల్ మార్కెట్ లో GST 2.0 నుండి అత్యధికంగా లాభం సంపాదించిన వాటిలో ఒకటిగా, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ తన కొనుగోలుదారులు పండుగ కాలంలో తమకు ఇష్టమైన మోటార్ సైకిల్ డెలివరీ పొందడంలో ఉన్న సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పరిశ్రమలోనే మొదటిసారిగా అందిస్తున్న ఈ ఆఫర్ లో , GST 2.0 ధరల తగ్గింపు ద్వారా కస్టమర్లు ఇప్పుడు తాము ప్రాధాన్యతనిచ్చిన జావా లేదా యెజ్డీ మోటార్ సైకిల్ ను పండగ రద్దీని తట్టుకోవడానికి ఆన్ లైన్ లో కేవలం రూ. 999కి ప్రీబుక్ చేయవచ్చు. 350 సిసి లోపు ఎనిమిది పెర్ఫార్మెన్స్ క్లాసిక్ మోటార్ సైకిల్స్ తో, తగ్గించబడిన ఆన్-రోడ్డు ధరలను ప్రకటించిన మొదటి కంపెనీ, GST సంస్కరణలు తరువాత, పెద్ద మొత్తంలోని రైడింగ్ జనాభాకు ప్రామాణికమైన హెరిటేజ్ మోటార్ సైక్లింగ్ ను తెస్తోంది.
పండగ స్ఫూర్తి మరియు 100- శాతం GST ప్రయోజనాలు జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ కు అందచేయబడిన (22 సెప్టెంబర్ నుండి) ఉత్సాహంలో డీలర్ షిప్స్ వద్ద బుక్కింగ్ చేసే వేగం పుంజుకుంది. jawayezdimotorcycles.com పై కేవలం రూ. 999కి ప్రీ-బుక్కింగ్ చేయడం ద్వారా తాము కలలు కన్న మోటార్ సైకిల్ ను ఈ హడావిడిలో పొందే అవకాశాలను కూడా బయ్యర్లు పెంచుకోవచ్చు.
శరద్ అగర్వాల్, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, జావా యెజ్డీ మోటార్ సైకిల్స్, ఇలా అన్నారు, “మా మోటార్ సైకిల్స్ కోసం ఉద్దేశ్యించబడిన GST రేటు సవరణ ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి ప్రారంభమైంది. ప్రపంచ స్థాయికి చెందిన డిజైన్, టెక్నాలజీ మరియు పెర్ఫార్మెన్స్ కలయికతో, మా క్లాసిక్ మోటార్ సైకిల్స్ భారతదేశపు యువత మోటార్ సైకిళ్లను సొంతం చేసుకోవాలని కలను నిజం చేస్తున్నాయి. ఈ పండగ సీజన్ లో భారతదేశంవ్యాప్తంగా చేస్తున్న బుక్కింగ్స్ కు అనూహ్యమైన ప్రతిస్పందన వచ్చింది, ఇది మేము ఆన్ లైన్ ప్రీబుక్కింగ్ ధరను రూ. 999కి అందచేయడానికి దారితీసింది.”
పోర్ట్ ఫోలియోలో సాటిలేని విలువ
GST 2.0 తగ్గింపుతో, 350 సిసి కంటే తక్కువగా మోటార్ సైకిల్స్ పై పన్ను రేటు 28 శాతం నుండి 18 శాతంకి తగ్గింది. తమ ధరలను తగ్గించి సాటిలేని విలువకు కస్టమర్లకు అందచేస్తున్న మొదటి కంపెనీ జావా యెజ్డీ మోటార్ సైకిల్స్. అత్యధిక శాతం మోడల్స్, అడ్వంచర్, రోడ్ స్టర్, బాబ్బర్ నుండి స్క్రాంబ్లర్ వరకు ఇప్పుడు రూ. 2 లక్షల లోపు లభిస్తున్నాయి. సాటిలేని ధరలకు నిజమైన దిగ్గజపు పెర్ఫార్మెన్స్ క్లాసిక్స్ ను అందించడానికి బ్రాండ్ యొక్క నిబద్ధతను కొత్త ధరలు సూచిస్తున్నాయి:
అన్ని జావా మరియు యెజ్డీ మోటార్ సైకిల్స్ కు సమగ్రమైన ‘ జావా యెజ్డీ BSA యాజమాన్యం హామీ కార్యక్రమం’ మద్దతునిస్తోంది, ఈ శ్రేణిలో పరిశ్రమలోనే మొదటి కార్యక్రమం.
కస్టమర్ హామీ కార్యక్రమం: ప్రతి రైడర్ కోసం మనశ్సాంతి
4 సంవత్సరాలు/50,000 కిమీ స్టాండర్డ్ వారంటీ: మా ఇంజనీరింగ్ శ్రేష్టతను ప్రదర్శించే శ్రేణిలోనే ప్రముఖ రక్షణను కార్యక్రమం అందిస్తోంది, తమ మోటార్ సైకిళ్లు దీర్ఘకాలం నాణ్యతను కలిగి ఉంటాయని రైడర్లకు మనశ్సాంతిని ఇస్తోంది.
ఆరేళ్ల వరకు దీర్ఘకాలం వారంటీ ఎంపికలు : బైక్ రోడ్డు పైన సిద్ధంగా ఉంటుంది మరియు ఊహించని మరమ్మతు ఖర్చుల ఒత్తిడ్ని పరిష్కరిస్తుందని ఆత్మవిశ్వాసంతో చెప్పే ప్రీమియం కవరేజ్.
రెండేళ్ల ఏ సమయంలోనైనా వారంటీ (యాజమాన్యం పొందిన ఆరేళ్ల లోగా): స్టాండర్డ్ వారంటీ ముగిసిన తరువాత కూడా అవసరమైనప్పుడు చేర్చబడే సరళమైన పరిష్కారం. ఇది కస్టమర్లు ఎల్లప్పుడూ కవరేజ్ కలిగి ఉండటాన్ని నిర్థారిస్తుంది.
ఒక ఏడాది అభినందనపూర్వకమైన రోడ్ సైడ్ అసిస్టెన్స్ (RSA): ఎనిమిదేళ్ల వరకు పొడిగించబడవచ్చు; రైడర్స్ కి ఎప్పుడు మరియు ఎక్కడ అవసరమైనా సహాయం పొందగలగడానికి హామీ ఇస్తుంది మరియు సుదూర ప్రాంతాల్లో ఇబ్బందులు పడకుండా నిర్థారిస్తుంది.
అయిదేళ్ల సమగ్రమైన AMC ప్యాకేజీ: అంచనా వేయదగిన ఖర్చులతో ఇబ్బందులు లేని సర్వీసింగ్, సాఫీ యాజమాన్యం అనుభవం కోసం ఊహించని ఖర్చుల్ని నిర్మూలిస్తోంది.