రైలులో ఆహారం అందచేయడానికి స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఇక్సిగో ట్రైన్స్, కన్ఫర్మ్ టికెట్

భారతదేశంలో ప్రముఖ AI ఆధారిత ట్రైన్ టిక్కెటింగ్ ప్లాట్ ఫాం, ఇక్సిగో ట్రైన్స్ అండ్ కన్ఫర్మ్ టికెట్

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 10 April 2026 10:49 PM IST

రైలులో ఆహారం అందచేయడానికి స్విగ్గీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఇక్సిగో ట్రైన్స్, కన్ఫర్మ్ టికెట్

భారతదేశంలో ప్రముఖ AI ఆధారిత ట్రైన్ టిక్కెటింగ్ ప్లాట్ ఫాం, ఇక్సిగో ట్రైన్స్ అండ్ కన్ఫర్మ్ టికెట్, ‘ఫుట్ ఆన్ ట్రైన్’ సేవలను మరింత శక్తివంతం చేయడానికి భారతదేశంలో ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్ ఫాం స్విగ్గీ (స్విగ్గీ లిమిటెడ్, NSE: SWIGGY / BSE: 544285)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్విగ్గీ వారి రెస్టారెంట్ నెట్ వర్క్ ను ఇక్సిగో అండ్ కన్ఫర్మ్ టిక్కెట్ యాప్స్ లో చేర్చడం ద్వారా, తమ ఇల్ల నుండి కస్టమర్లు ఆర్డర్ చేసినప్పుడు ఆశించే అదే ఎంపిక, విశ్వాసం, మరియు విలువలతో "ప్రయాణంలో" ప్రయాణికుల ఆకలి సమస్యకు కావలసిన పరిష్కారాన్ని ఈ సహకారం కేటాయిస్తుంది.

ఈ విలీనం ద్వారా, ప్రయాణికులు ప్రసిద్ధి చెందిన జాతీయ బ్రాండ్స్ నుండి నగరాల్లో బాగా తెలిసిన స్థానిక రుచుల వరకు విస్తృత శ్రేణి భోజనాల ఎంపికలను పొందవచ్చు, తాము ప్రయాణించే మార్గం వెంట ఉన్న ప్రాంతీయ ప్రత్యేకతలను అన్వేషించవచ్చు లేదా పరిచయమున్న ఇష్టమైన భోజనాలను ఎంచుకోవచ్చు. తాము ప్రాధాన్యతనిచ్చిన బోజనాలను నిరంతరంగా ఆర్డర్ చేయడానికి మరియు తమ సీట్ల వద్దకు నేరుగా డెలివరీని పొందడానికి ప్రయాణికులకు వీలు కల్పించడం ద్వారా రైలు ప్రయాణాలను మరింత సౌకర్యవంతం చేయడానికి ఈ సేవలు రూపొందించబడ్డాయి.

ఈ భాగస్వామంతో రైలు ప్రయాణికులు భారతదేశంలోని 160 + రైల్వే స్టేషన్స్ లో 40,000 నమ్మకమైన రెస్టారెంట్ భాగస్వాముల నుండి ఎంపిక చేసిన మెనూలు బ్రౌజ్ చేయవచ్చు, తాజా మరియు పరిశుభ్రమైన భోజనాలను ఆర్డర్ చేయవచ్చు, వాస్తవిక సమయంలో తమ ఆర్డర్ను ట్రాక్ చేయవచ్చు మరియు రైలులో తమ సీట్ల వద్దకు నేరుగా డెలివరీ పొందవచ్చు. ప్రయాణికులు 4 రోజులు ముందు నుండి రైలు రావడానికి 30 నిముషాల ముందు వరకు కూడా భోజనాలు బుక్ చేయవచ్చు. ఇంకా, రైలులో ఇచ్చే ఆహారం ఆర్డర్లపై స్విగ్గీ ‘డెలివరీ హామీ ఇస్తోంది లేదా పూర్తి డబ్బు వాపసు’ ఇచ్చే సౌకర్యం కూడా అందచేస్తోంది.

‘ఫుడ్ ఆన్ ట్రైన్’లో స్విగ్గీ రెస్టారెంట్ల జాబితాను చూడటానికి కస్టమర్లు తమ ఇక్సిగో లేదా కన్ఫర్మ్ టిక్కెట్ యాప్ ను నవీకరించవచ్చు. ఆర్డర్ చేయడానికి, ప్రయాణికులు ఇక్సిగో ట్రైన్స్ లేదా కన్ఫర్మ్ టిక్కెట్ యాప్ లోని హోం పేజీపై ‘ఆర్డర్ ఫుడ్ ఆన్ ట్రైన్’ ఎంపికను ఎంచుకోవచ్చు, PNR నంబర్ నమోదు చేయవచ్చు మరియు డెలివరీ స్టేషన్ ను ఎంచుకోవచ్చు. తదుపరి వారు విస్తృత శ్రేణి స్విగ్గీ భాగస్వాముల నుండి బ్రౌజ్ చేయవచ్చు, చెల్లింపు పూర్తి చేయవచ్చు మరియు తమ ఆర్డర్ ను లైవ్ లో ట్రాక్ చేయవచ్చు.

ఈ భాగస్వామం గురించి వ్యాఖ్యానిస్తూ, శ్రీపద్ వైద్య, COO, ఇక్సిగో ట్రైన్స్ & కన్ఫర్మ్ టిక్కెట్, ఇలా అన్నారు, "ట్రైన్ ప్రయాణం యొక్క ప్రతి అంశాన్ని సరళం చేసి మరియు మెరుగుపరచడానికి మేము ఎల్లప్పుడూ శ్రద్ధవహిస్తాము. ఆహారం ఆ అనుభవంలో అంతర్భాగం. స్విగ్గీతో భాగస్వామం చేయడం ద్వారా, మేము ఇప్పటికే ఉన్న మా “ఫుడ్ ఆన్ ట్రైన్” ఫీచర్ ను శక్తివంతం చేయడానికి రైలు ప్రయాణం గురించి మా లోతైన అవగాహనను స్విగ్గీ వారి శక్తివంతమన రెస్టారెంట్ నెట్ వర్క్ మరియు డెలివరీ నైపుణ్యతతో కలుపుతున్నాం. ఈ సహకారం గొప్ప ఎంపిక, విశ్వశనీయత మరియు నిజాయితీలను అందించడానికి మాకు వీలు కల్పిస్తుంది మరియు సకాలంలో మరియు పరిశుభ్రమైన భోజనాల డెలివరీని నేరుగా ప్రయాణికుల సీట్ల వద్దకు అందచేయబడేలా నిర్థారిస్తుంది."

దీపక్ మలూ, వైస్ ప్రెసిడెంట్, ఫుడ్ స్ట్రాటజీ, కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ & న్యూ ఇనీషియేటివ్స్, స్విగ్గీ, ఇలా అన్నారు, "భారతదేశపు రైల్వేలు 18 మిలియన్ లకు పైగా దూరాలకు రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులను రోజూ తీసుకువెళ్తాయి, మరియు ప్లాట్ ఫాంపై ఆకలి ఆగిపోదు. ఇక్సిగో ట్రైన్స్ అండ్ కన్ఫర్మ్ టిక్కెట్ తో మా భాగస్వామం అనేది స్విగ్గీ వారి నమ్మకమైన రెస్టారెంట్ నెట్ వర్క్ ను నేరుగా రైలు ప్రయాణానికి తెచ్చింది, 160+ స్టేషన్స్ నుండి భోజనాలు ఎంపిక చేయవచ్చు. లక్షలాది ప్రయాణికుల కోసం, ఈ సదుపాయం అనగా ఇంటి నుండి వారు ఆశించే అదే నాణ్యత మరియు సౌకర్యం అని అర్థం, ఇప్పుడు రైలులో వాటిని ముఖ్యంగా ఎక్కువ దూరాలు ప్రయాణం చేసినప్పుడు అనుసరిస్తున్నారు."

IRCTC ఇ-కాటరింగ్ శ్రేణికి మార్గదర్శకత్వంవహించిన నాటి నుండి భారతదేశంలో రైలులో ఆహారం డెలివరీ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది, రైలు ప్రయాణాల సమయంలో సౌకర్యవంతమైన ఆహారం డెలివరీ కోసం పెరుగుతున్న డిమాండ్ ను ప్రధానాంశంగా చచూపిస్తోంది. ఈ భాగస్వామం ఇక్సిగో యొక్క ప్రస్తుతమున్న ”ఫుడ్ ఆన్ ట్రైన్” ఆఫరింగ్ ను మరింత శక్తివంతం చేస్తుంది, స్టేషన్లలో రైలు ఆగినప్పుడు తమ సీట్ల వద్దకే నేరుగా డెలివరీ కోసం ముందస్తుగా భోజనాలకు ఆర్డర్ చేయవచ్చు.

రైళ్లల్లో ప్రయాణ సమయంలో ఆహారం తినడం నుండి ఎంపిక చేయబడిన వంటకాల అనుభవాన్ని పొందడానికి ఇది ఖచ్చితమైన మార్పు అని స్విగ్గీ వారి తాజా వినియోగదారు డేటా సూచిస్తోంది, కొన్ని కీలకమైన ధోరణులను సూచిస్తోంది. ‘హెరిటేజ్ ఫ్లేవర్’ పెంపుదల స్పష్టంగా కనిపిస్తోంది: బిర్యానీ ట్రాక్స్ లో సాటిలేని రారాజుగా నిలవగా, ప్రాంతీయ రుచుల కోసం డిమాండ్ పెరుగుతోంది. ప్రయాణికులు వివిధ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుండగా సంప్రదాయబద్ధమైన స్థానిక రుచులైన వడ పావ్, అడాయ్, అప్పం, మరియు లిట్టీ చౌకీ వంటి వాటిని ఎంచుకోవడం పెరిగింది. హృదయాన్ని తాకే ధోరణిగా, సుమారు 14% ఆర్డర్లను ఇప్పుడు ప్రయాణికులు కాని వారు కూడా చేస్తున్నారు. రైళ్లల్లోని తమ ప్రియమైన వారు తమ తదుపరి స్టాప్ లో తాజా, వేడి భోజనాలను అందుకోవడాన్ని నిర్థారించడానికి తమ ఇళ్ల నుండి సౌకర్యవంతంగా, కుటుంబ సభ్యులు స్విగ్గీని వాడుతున్నారు. రైళ్లల్లో ప్రయాణించే వారికి సమూహ విందులు ఇప్పుడు సర్వ సాధారణంగా మారాయి. ప్లాట్ ఫాం యొక్క దృఢమైన మౌళిక సదుపాయాలను ప్రదర్శిస్తూ, స్విగ్గీ నిరంతరంగా 45 పదార్థాలతో కూడిన పెద్ద సింగిల్ ఆర్డర్లను అందిస్తోంది, ప్రయాణంలోని పెద్ద కుటుంబాలకు మరియు విద్యార్థి సమూహాలు కలిసి సంబరం చేసుకోవడానికి తోడ్పడుతోంది.

ఇక్సిగో యొక్క శక్తివంతమైన రైలు యూజర్ ల సంఖ్యను మరియు స్విగ్గీ యొక్క విస్తారమైన ఆహారం డెలివరీ వ్యవస్థను ఒక చోటకు తీసుకురావడం ద్వారా, భాగస్వామం కస్టమర్లకు మరిన్ని రకాలు, మెరుగైన సేవా విశ్వశనీయత మరియు సజావుగా డిజిటల్ అనుభవం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, భారతదేశంలో రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తోంది.

Next Story