ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్

ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Jan 2025 4:15 PM IST
ఇండియాలో ఇసుజు మోటార్స్ 4 కొత్త టచ్ పాయింట్స్

ఇసుజు మోటార్స్ లిమిటెడ్,జపాన్ వారి అనుబంధ సంస్థ అయిన ఇసుజు మోటార్స్ ఇండియా భారతదేశవ్యాప్తంగా నాలుగు కొత్త టచ్ పాయింట్స్ ప్రారంభముతో భారతదేశములో తన ఫుట్‎ప్రింట్ ను విస్తరించింది. ఇందులో ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రాలలో రెండు కొత్త అధీక్రిత సేవా కేంద్రాలు (ఏఎస్‎సిలు) తో సహా ఇండోర్, మధ్యప్రదేశ్ మరియు పాట్నా, బీహార్ లలో కొత్త 3S (సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్) డీలర్షిప్ ఉన్నాయి.

ఈ కొత్త చేరికలతో, ఇసుజు యొక్క నెట్వర్క్ భారతదేశవ్యాప్తంగా 72 ప్రదేశాలకు పెరిగింది. ఇది మా వినియోగదారులకు దగ్గరగా ఉండడము, వినియోగదారు సంతృప్తి మరియు నిరంతరాయ యాజమాన్య అనుభవము కొరకు మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తుంది.

ఇండోర్ కొరకు ఇసుజు మోటార్స్ సాగర్ ఇసుజుతో మరియు బీహార్ కొరకు ఇంపీరియల్ ఇసుజుతో చేతులు కలిపింది. ఇది బీహార్ లోకి ఇసుజు విస్తరణను సూచిస్తుంది. మా సేవలను మరియు వినియోగదారులతో సంబంధాలను పెంచుకొనుటకు, కంపెనీ ఖమ్మం, తెలంగాణ మరియు రత్నగిరి, మహారాష్ట్రలో కొత్త ఏఎస్‎సిలను ప్రారంభించింది. బియాండ్ ఆటో కేర్ చే ఖమ్మం ఏఎస్‎సి మరియు ష్రైన్ ఇసుజు ద్వారా రత్నగిరి ఏఎస్‎సి నిర్వహించబడతాయి. ష్రైన్ ఇసుజు కొల్హాపూర్ లో 3S సదుపాయాన్ని కూడా నిర్వహిస్తుంది. ఈ సదుపాయాలు ఇసుజు యొక్క డీలర్షిప్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి మరియు అసాధారణ వినియోగదారు అనుభవాలను అందించుటకు సిబ్బంది అందరికి ఇసుజు నిపుణులచే శిక్షణ ఇవ్వబడుతుంది.

నెట్వర్క్ విస్తరణ గురించి వ్యాఖ్యానిస్తూ రాజేష్ మిట్టల్, ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా అన్నారు, "మా నిరంతర నెట్వర్క్ విస్తరణ ఇసుజు యొక్క బ్రాండ్ పురోగతిని ప్రతిబింబిస్తుంది మరియు ఒక భిన్నమైన అనుభవాన్ని అందిస్తూ మా వినియోగదారులకు దగ్గరగా ఉండాలనే మా నిబద్ధతను నొక్కి చెప్తుంది. ఈ డీలర్షిప్స్ మరియు సేవా కేంద్రాల చేర్పుతో, దేశవ్యాప్తంగా ఇసుజు వాహనాల కొరకు పెరుగుతున్న డిమాండ్ ను నెరవేర్చుటకు మేము సిద్ధంగా ఉన్నాము. "

తోరు కిషిమోటో, డెప్యూటి మేనేజింగ్ డైరెక్టర్, ఇసుజు మోటార్స్ ఇండియా, ఇలా చెప్పుకొచ్చారు, "ఇసుజు వద్ద, మేము వినియోగదారుల యాజమాన్య ప్రయాణములో వినియోగదారుడికి ప్రాధాన్యతను ఇస్తాము. ఈ కొత్త సదుపాయాలు నిరంతరాయ, వ్యక్తిగతీకరించబడిన అమ్మకాలు మరియు సేవా అనుభవాన్ని అందించాలనే మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తాయి. మేము యాజమాన్య ప్రయాణాన్ని పెంచుటకు పాటుపడుతున్నాము. ఇసుజు ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళుటకు తమ ప్రయత్నాలతో మా కొత్త డీలర్స్ కొరకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము."

Next Story