భారతదేశంలోని అతిపెద్ద పాప్ కార్న్ కంపెనీ అయిన గౌర్మెట్ పాప్ కార్నికా ప్రైవేట్ లిమిటెడ్ , పాప్ కార్న్ మొక్కజొన్న(మైజ్) సాగు పరంగా భారతదేశం స్వీయ సమృద్ధి సాధించటంలో అందించిన తోడ్పాటుకుగానూ ఐసిఏఆర్-ఐఐఎంఆర్ అవార్డు అందుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైజ్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) ల భాగస్వామ్యంతో భారతదేశపు పాప్‌కార్న్ మొక్కజొన్న వాల్యూ చైన్ ను బలోపేతం చేయడం, రైతుల ఆదాయాలను పెంచడం, అధిక-నాణ్యత కలిగిన పాప్ కార్న్ మొక్కజొన్న ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా మారాలనే భారతదేశ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం ద్వారా విజయవంతమైన ఫలితాలను గౌర్మెట్ పాప్ కార్నికా చూస్తోంది.
ఐసిఏఆర్-ఐఐఎంఆర్ వ్యవస్థాపక దినోత్సవం 2026 సందర్భంగా ఇటీవల ఈ అవార్డును అందజేశారు. భారతదేశంలో మొక్కజొన్న విస్తరణ , ఆ విస్తరణలో సహకారం అందించినందుకు సిబ్బంది, ప్రగతిశీల రైతులు , భారతదేశ కంపెనీలను ఈ అవార్డు గుర్తిస్తుంది.
ఈ అవార్డును ఐసిఏఆర్-ఐఐఎంఆర్ మైజ్ డైరెక్టర్ డాక్టర్ హనుమాన్ సహాయ్ జాట్, గౌర్మెట్ పాప్‌కార్నికా క్రాప్ ఇంటిగ్రేషన్ సీఈఓ వై యుగంధర్, గౌర్మెట్ పాప్‌కార్నికా డైరెక్టర్ కె మహియాధర్ రెడ్డికి అందజేశారు.
ఈ అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా, పిఎయు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సత్బీర్ సింగ్ గోసల్, డాక్టర్ సియాన్ దాస్ (ఐఐఎంఆర్ మాజీ డైరెక్టర్), డాక్టర్ నచికేత్ కొత్వాలివాలే (డైరెక్టర్ - ఐసిఎఆర్ -సిఐపిహెచ్ఇటి), డాక్టర్ అశోక్ మెహతా (ఐసిఎఆర్ మాజీ డైరెక్టర్), డాక్టర్ సరబ్జీత్ సింగ్ (ప్రగతిశీల వ్యవసాయ యంత్రాల వ్యవస్థాపకులు ) మరియు ఓ పి చౌదరి (సీనియర్ సాయిల్ సైంటిస్ట్, పిఎయు), మరియు పిఎయు , ఐఐఎంఆర్ నుండి ఇతర సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.