గోద్రేజ్ ఆగ్రోవెట్ కొత్త కీటక నాశిని 'TAKAI'ని విడుదల చేసింది
భారత్‌లోని ప్రముఖ వైవిధ్యభరితమైన అగ్రి-బిజినెస్ సంస్థలలో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్), వరి పంట కోసం అభివృద్ధి చేసిన సరికొత్త కీటక నాశిని టకాయ్ (TAKAI)ని విడుదల చేసింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
భారత్‌లోని ప్రముఖ వైవిధ్యభరితమైన అగ్రి-బిజినెస్ సంస్థలలో ఒకటైన గోద్రేజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (గోద్రేజ్ ఆగ్రోవెట్), వరి పంట కోసం అభివృద్ధి చేసిన సరికొత్త కీటక నాశిని టకాయ్ (TAKAI)ని విడుదల చేసింది. జపాన్‌కు చెందిన ఐఎస్‌కే సంస్థ అభివృద్ధి చేసిన సైక్లాప్రిన్ (CyclaprynTM) టెక్నాలజీతో రూపొందిన టకాయ్, వరిలోని ప్రధాన తెగుళ్లైన కాండం తొలిచే పురుగు, ఆకు ముడత పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని నాట్లు వేసిన 15-30 రోజుల తర్వాత (DAT) ఒకసారి, మళ్లీ 40-60 రోజుల తర్వాత (DAT) 160 మి.లీ మోతాదులో వాడితే, వరి పంటకు సుదీర్ఘ కాలం పాటు రక్షణ లభిస్తుంది. మొక్కజొన్న, మిరప, క్యాబేజీ, సోయాబీన్, శనగ మరియు చెరకు పంటలలో కూడా టకాయ్ వినియోగానికి సంబంధించి లేబుల్ అనుమతులు పొందే ప్రక్రియలో కంపెనీ ఉంది.
తీవ్రస్థాయిలో కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు 30% నుండి 40% వరకు దిగుబడి నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా ఆకు ముడత పురుగు ఉధృతి వల్ల 20% నుండి 30% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఇవి తరచూ పంట ప్రారంభ మరియు మధ్య దశలలో దాడి చేస్తాయి, ఆ సమయంలో వీటిని గుర్తించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టడం సవాలుతో కూడుకున్న పని. ఈ కారణాల వల్ల, భారత్ 150.18 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, హెక్టారుకు సగటు దిగుబడి మాత్రం ~2.9 టన్నుల వద్దే తక్కువగా ఉంది. ఇది ప్రపంచ అత్యుత్తమ దిగుబడి అయిన 5 టన్నులు/హెక్టారుతో పోలిస్తే చాలా తక్కువ.
గోద్రేజ్ ఆగ్రోవెట్ ఎండీ, సీఈఓ సునీల్ కటారియా మాట్లాడుతూ, "భారతీయ వరి రైతు విజయం అనేది సమర్థవంతమైన తెగుళ్ల నివారణపైనే ఆధారపడి ఉంటుంది. టకాయ్ ద్వారా మేము వరి రైతులకు తమ పంటలను తెగుళ్ల నుండి రక్షించుకునేలా చేయడమే కాకుండా, వేగవంతమైన నియంత్రణను, సుదీర్ఘ కాలం పాటు పని చేసే పరిష్కారాన్ని అందిస్తున్నాం. తద్వారా పంట ఆరోగ్యం మెరుగుపడుతుంది" అని తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. "గోద్రేజ్ ఆగ్రోవెట్ వద్ద మా లక్ష్యం, మన రైతులు ఎదుర్కొంటున్న పర్యావరణ మరియు మార్కెట్ సవాళ్లను పరిష్కరించే పంట రక్షణ మార్గాలను అందించడం. టకాయ్ లాంచ్ మా వ్యూహానికి అనుగుణంగా ఉంది. మా పరిశోధన నైపుణ్యం, క్షేత్రస్థాయిలో మాకున్న పటిష్టమైన నెట్‌వర్క్ ద్వారా కీలకమైన పంటల విషయంలో మా పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేస్తున్నాం. ఇది రైతులకు సాధికారతనివ్వడమే కాకుండా, వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది" అని వివరించారు.
ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేసే వరి పంట, వెచ్చని, తేమతో కూడిన మరియు నీరు నిలిచి ఉండే పరిస్థితులలో పెరుగుతుంది. ఇది ఏడాది పొడవునా తెగుళ్లు ఆశించడానికి అనుకూలమైన వాతావరణం. నాట్లు వేసిన 15-30 రోజుల మధ్య ఉండే కీలకమైన ప్రాథమిక దశలో (వెజిటేటివ్ స్టేజ్), కాండం తొలిచే పురుగు మొక్కను దెబ్బతీస్తుంది, దీనిని ప్రారంభంలో గుర్తించడం రైతులకు చాలా కష్టమవుతుంది. ఆ తర్వాత 40-60 రోజుల పునరుత్పత్తి దశలో, కాండం తొలిచే పురుగుతో పాటు ఆకు ముడత పురుగు కూడా మొక్కపై దాడి చేస్తాయి. ఆకు ముడత పురుగు ఆకులను మడిచి కణజాలాన్ని తినడం వల్ల మొక్క కిరణజన్య సంయోగక్రియ జరిపే సామర్థ్యం తగ్గి పంట ఎదుగుదల దెబ్బతింటుంది. ఈ నష్టాన్ని నివారించడానికి, పంట 15-30 రోజుల వయస్సులో ఉన్నప్పుడు ఒకసారి, తిరిగి 40-60 రోజుల దశలో మరొకసారి 160 మి.లీ మోతాదులో టకాయ్ (TAKAI)ని వాడాలి.
టకాయ్ విడుదలను ఉద్దేశించి గోద్రేజ్ ఆగ్రోవెట్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ సీఈఓ ఎన్.కె.రాజవేలు మాట్లాడుతూ, "మేం నిర్వహించిన ప్రీ-లాంచ్ సర్వేలో 77 శాతం మంది వరి రైతులు వేగవంతమైన తెగుళ్ల నియంత్రణ, సుదీర్ఘ కాలం పాటు ఉండే ప్రభావం మరియు మెరుగైన పంట ఆరోగ్యాన్ని కోరుకుంటున్నట్లు వెల్లడైంది. అందుకే జపాన్‌కు చెందిన ISK సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని భారతీయ రైతుల కోసం టకాయ్‌ను అందుబాటులోకి తెస్తున్నాము. సైక్లాప్రిన్ సాంకేతికతతో పనిచేసే ఇది, పురుగులు ఆహారం తీసుకోకుండా తక్షణమే అడ్డుకోవడంతో పాటు సుదీర్ఘ కాలం పాటు తెగుళ్లను అదుపులో ఉంచుతుంది. ఈ విధానం తెగుళ్ల ఉధృతిని తగ్గించి, రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంలో, స్థిరమైన మరియు నాణ్యమైన అధిక దిగుబడులను సాధించడంలో సహాయపడుతుంది. ఇప్పటికే మొక్కజొన్న, మిరప, క్యాబేజీ, సోయాబీన్, శనగ, చెరకు పంటల్లో కూడా దీని వినియోగానికి అనుమతులు రాబోతున్న నేపథ్యంలో, మారుతున్న వ్యవసాయ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచడానికి మరియు రైతు కుటుంబాలకు అండగా నిలవడానికి టకాయ్ కీలక పాత్ర పోషిస్తుందని మేం నమ్ముతున్నాం" అని పేర్కొన్నారు.
ఇవాళ విడుదల చేసిన టకాయ్, గత ఏడాది విడుదల చేసిన మొక్కజొన్న కలుపు నాశిని అషితాక (ASHITAKA) ద్వారా, గోద్రేజ్ ఆగ్రోవెట్ తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఆవిష్కరణలు, రైతు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడం ద్వారా మరింత ఉత్పాదకత కలిగిన, స్థితిస్థాపకత గల, స్థిరమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి కంపెనీ కృషి చేస్తోంది.