పేలిన గ్యాస్ సిలిండర్.. 10 మందికి గాయాలు
బెంగళూరు మరియప్పనపాళ్యలో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10 మంది గాయపడ్డారు.
By అంజి Published on 3 March 2023 4:11 PM ISTపేలిన గ్యాస్ సిలిండర్.. 10 మందికి గాయాలు
ఇటీవల ఎక్కువగా గ్యాప్ పేలడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా బెంగళూరు మరియప్పనపాళ్యలో శుక్రవారం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు సహా 10 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయడం మరిచిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం వంటగదిలో వంట చేసేందుకు వెళ్లగా గ్యాస్ పేలింది.
అజ్మల్ (46), నజీమ్ (42), రియాన్ (14), అద్నాన్ (12), ఫయాజ్ (10), మెహరున్నీసా (11), అజాన్ (5), జైనాబ్ (8), అమీర్ ఖాన్ (52), షబానాజ్ (18) , నసీమా (40), సల్మా (33), రేష్మా భాను (48) గాయపడిన వ్యక్తులు, వారిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో కుటుంబ కార్యక్రమం ఉందని, ప్రత్యేక వంటకాలు వండటానికి ప్రయత్నించగా గ్యాస సిలిండర్ పేలిందని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి ఇంట్లో పగుళ్లు ఏర్పడ్డాయి. అగ్నిమాపక దళం, అత్యవసర సేవల సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ముఖ్యంగా ప్రతి వంటగదిలో తగినంత గాలి.. వెలుతురు వచ్చేలా కిటికీలు ఏర్పాటు చేయాలి. గ్యాస్ స్టౌకు ఎదురుగా మాత్రం కిటికీ ఉండకూడదు. వంట గదిలో గ్యాస్ సిలిండర్ మాత్రమే ఉండాలి. కిరోసిన్, ఇతర మండే స్వభావం ఉన్న పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్‌ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి. స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఎట్టి పరిస్థిల్లో ఉండకూడా చూసుకోవాలి.