సర్వీస్‌గా జిపియూ.. ప్రారంభించిన ఈఎస్‎డిఎస్ సాఫ్ట్‎వేర్ సొల్యూషన్ లిమిటెడ్

ఈఎస్‎డిఎస్ సాఫ్ట్‎వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ఈరోజు, కంపెనీ యొక్క 20వ వార్షిక దినోత్సవ మెగా వేడుక సందర్భంగా సావరిన్-గ్రేడ్ జిపియూ ను ఒక సర్వీస్ గా తన సర్వీస్ పోర్ట్‎ఫోలియో విస్తరణలలో ఒకదానిని ప్రకటించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 1 Dec 2025 4:21 PM IST

సర్వీస్‌గా జిపియూ.. ప్రారంభించిన ఈఎస్‎డిఎస్ సాఫ్ట్‎వేర్ సొల్యూషన్ లిమిటెడ్

ఈఎస్‎డిఎస్ సాఫ్ట్‎వేర్ సొల్యూషన్ లిమిటెడ్ ఈరోజు, కంపెనీ యొక్క 20వ వార్షిక దినోత్సవ మెగా వేడుక సందర్భంగా సావరిన్-గ్రేడ్ జిపియూ ను ఒక సర్వీస్ గా తన సర్వీస్ పోర్ట్‎ఫోలియో విస్తరణలలో ఒకదానిని ప్రకటించింది. ఈ వేడుక సూల వైన్‎యార్డ్స్, నాశిక్ వద్ద పీయూష్ ప్రకాశ్ చంద్ర సోమాని – ఈఎస్‎డిఎస్ యొక్క ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ మరియు ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు ఇతర గౌరవనీయ అతిథుల సమక్షములో నిర్వహించబడింది. ప్రముఖ సంస్థలు, పరిశోధన సంస్థలు, బిఎఫ్‎ఎస్‎ఐ మరియు ప్రభుత్వ రంగాలలో AI/ML, జెన్AI మరియు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‎ఎల్‎ఎం) పనిభారాల విశేష వృద్ధికి తోడ్పడుటకు ఈ విస్తరణ రూపొందించబడింది.

ప్రస్తుతము ప్రపంచస్థాయిలో అధిక-పనితీరు AI కంప్యూట్ అందించే ఒక సావరిన్-గ్రేడ్ మేనేజ్డ్ జిపియూ ప్రొవైడర్ గా తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న ఈఎస్‎డిఎస్ ను ఈ ముఖ్యమైన ప్రారంభము సంపూర్ణ క్లౌడ్ స్పెక్ట్రం, నిర్వహించబడే సేవలు, డేటా సెంటర్ మౌలికసదుపాయాలు మరియు సాఫ్ట్‎వేర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ గా నిలబెట్టింది. జిపియూలు & యాక్సిలరేటర్స్ తో కలిపి AI- ఆప్టిమైజ్ చేయబడిన సర్వర్లపై ప్రపంచ వ్యయం 2026లో ~US $329.5 బిలియన్లు తాకుతుందని అంచనావేయబడింది. నిర్ణయాత్మకమైన, హై-త్రూపుట్ కంప్యూట్ వాతావరణాల ఆవశ్యకత ఎక్కువగా ఉంది. ఈఎస్‎డిఎస్ ప్రస్తుతం సంస్థలు, బిఎఫ్‎ఎస్‎ఐ, పరిశోధన సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థలకు మిషన్-క్రిటికల్ AI పనిభారాలను నిరంతర పనితీరు, సురక్షితమైన కార్యకలాపాలు మరియు తక్కువ-లాటెన్సీ డిస్ట్రిబ్యూటెడ్ శిక్షణల కోసం ఒక ఉద్దేశంతో-నిర్మించబడిన జిపియూ సూపర్‎పాడ్స్ పై నడిపించే వీలు కలిగిస్తుంది. పూర్తిగా నివహించబడిన జిపియూ AI ను సరైన ఆర్కిటెక్చరల్ పునాదితో నమ్మకంగా కొలవడములో సహాయపడే సంస్థల మౌలికసదుపాయాల కలయికలో ఈఎస్‎డిఎస్ తన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంది.

పీయూష్ సోమాని, ఈఎస్‎డిఎస్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్, ఇలా అన్నారు, “ఇది పరిశ్రమలలో భారీ-స్థాయి AI మౌలికసదుపాయాల కొరకు పెరుగుతున్న డిమాండ్ ను పరిష్కరించుటకు ఒక వ్యూహాత్మక చర్య. ప్రపంచ AI విలువ 2030 నాటికి సుమారు US $15.7 ట్రిలియన్లకు చేరుకుంటుందని మరియు ఆ పెట్టుబడిలో 80% జిపియూ వైపుకు మళ్ళించబడుతుందని అంచనావేయబడిన నేపథ్యములో, విశ్వాసయోగ్యమైన, అధిక-పనితీరు జిపియూ ఎకోవ్యవస్థల కొరకు అవసరము కొత్త స్థాయికి చేరుకుంది. చాలాకాలంగా సంస్థలు AI స్థాయిని పెంచాలని అనుకున్నాయి కాని జిపియూ మౌలికసదుపాయాల సంక్లిష్టత, సందిగ్ధత మరియు నిషేధిత ఖర్చు వలన వెనక్కు తగ్గాయి. ఈ ప్రారంభముతో, భారీ-స్థాయి జిపియూ క్లస్టర్లు మరియు సూపర్‎పాడ్స్ కు ప్రాప్యతను అందిస్తున్నాము, తద్వారా అవి AI ఆశయాలు ఉన్న సంస్థలకు సరళమైనవి, పారదర్శకమైనవి మరియు ఒక ఉద్దేశముతో నిర్మించబడినవిగా చేయబడ్డాయి. ఊహించదగిన పనితీరు, స్థిరత్వము మరియు స్థాయిని అందించడము ద్వారా మా జిపియూ సూపర్‎పాడ్స్ ప్రధానంగా ఈ కథనాన్ని మారుస్తాయి. వినియోగదారులకు మరింత సాధికారతను అందించుటకు మేము వ్యాపారాలు తమ జిపియూ మోడల్ ను ఎంచుకొనుటకు, తమ క్లస్టర్ ను రూపొందించుకొనుటకు మరియు ఆర్కిటెక్చర్ మరియు ఖర్చులకు తక్షణ దృశ్యమానతను అందించేందుకు, మేము సూపర్‎పాడ్ కాన్ఫిగురేటర్ టూల్ ను సృష్టించాము.”

NVIDIA’s DGX and HGX B200, B300, GB200 మరియు విప్లవాత్మక NVL72 ఆర్కిటెక్చర్ తో సహా, AMD’s MI300X ప్లాట్ఫార్మ్స్ మరియు మరెన్నిటినో కలుపుకొని అత్యాధునిక జిపియూ వ్యవస్థల శక్తివంతమైన లైనప్ ఈ ప్రారంభము యొక్క ఉద్దేశము. ఈ వ్యవస్థలు భారీ మోడల్స్ కు శిక్షణ ఇవ్వడం, అనుమతి వేగాన్ని వేగవంతం చేయడం, అనుకరణ పనిభారాలను అమలుచేయడం మరియు అపూర్వమైన పనితీరుతో భారీ డేటా కార్యకలాపాలను నిర్వహించడాన్ని అనుకూలపరుస్తాయి. ఈఎస్‎డిఎస్ యొక్క జిపియూ సూపర్‎పాడ్స్ అధిక-బాండ్‎విడ్త్ NVలింక్ కనెక్టివిటి, యూనిఫైడ్ మెమొరీ పూల్స్, ఇంటలిజెంట్ షెడ్యూలింగ్, పెరిగిన థర్మల్ మేనేజ్మెంట్ మరియు AI-ఆప్టిమైజ్ చేయబడిన కూర్పుతో రూపొందించబడి, ఏ స్థాయిలో అయినా ఊహించదగిన పనితీరును నిర్ధారిస్తుంది. ఈఎస్‎డిఎస్ యొక్క పూర్తి-స్పెక్ట్రం జిపియూ సర్వీస్ పోర్ట్‎ఫోలియోలో క్యాప్టివ్ జిపియూ క్లస్టర్స్ కొరకు అడ్వైజరీ మరియు డిజైన్ కన్సల్టెన్సీ, ఎండ్-టు-ఎండ్ సరఫరా, జిపియూ పరిసరాల డిప్లాయ్మెంట్ మరియు కార్యకలాపాలు, అంకితభావము కలిగిన జిపియూ ఒక-సర్వీస్ గా-మౌలికసదుపాయాలు, హైబ్రిడ్ సిపియూ+జిపియూ క్లౌడ్ ఎంపికలు మరియు ఆన్-డిమాండ్ నిర్వహించబడే జిపియూ క్లౌడ్ ఉంటాయి. సంస్థలు ఇప్పుడు వివిక్త, సమ్మతి-సిద్ధమైన AI వాతావరణాలను నియోగించవచ్చు; భారీ-స్థాయి డిస్ట్రిబ్యూటెడ్ శిక్షణ పనిభారాలను అమలుచేయవచ్చు; లేదా జిపియూ శక్తిని ఒక యుటిలిటిగా స్పిన్ అప్ చేయవచ్చు. రాక్ ఇంజనీరింగ్ నుండి నెట్వర్క్ ఆప్టిమైజేషన్, కంటెయినర్ కలయిక, పనితీరును మెరుగుపరచడం మరియు AI/ML ఓపిఎస్ సర్వీస్ ఎంపికలతో 24x7 పర్యవేక్షణ వరకు ఈఎస్‎డిఎస్ అన్నిటిని నిర్వహిస్తుంది.

ఈ ప్రారంభములో భాగంగా, ఈఎస్‎డిఎస్ తన ప్రత్యేక సూపర్‎పాడ్ కాన్ఫిగురేటర్ ను కూడా ప్రవేశపెట్టింది. ఇది సంస్థలు తమ AI మౌలికసదుపాయలను సంపూర్ణ ఖచ్ఛితత్వముతో రూపొందించుకునే వీలు కలిగిస్తుంది. టూల్ ను నావిగేట్ చేసే యూజర్లు వారికి ఇష్టమైన జిపియూ మోడల్ ను ఎంచుకోవచ్చు, కంప్యూట్ డెన్సిటి, మెమొరీ ప్రొఫైల్స్, స్టోరేజ్ టైర్స్ మరియు ఇంటర్ కనెక్ట్ ఎంపికలను కస్టమైజ్ చేసుకోవచ్చు మరియు కాన్ఫిగురేటర్ ఆటోమాటిక్ గా ఒక పూర్తిగా ఆప్టిమైజ్ చేయబడిన సూపర్‎పాడ్ ఆర్కిటెక్చర్ ను వారి పనిభారం అవసరాలకు తగినట్లు నిర్మిస్తుంది. ఈ వ్యవస్థ తక్షణమే పనితీరు అంచనాలను ఉత్పన్నం చేస్తుంది, కాన్ఫిగురేషన్స్ మరియు పారదర్శకమైన ఖర్చు అంచనాలను సిఫారసు చేస్తుంది, తద్వారా సంస్థలు అమలు చేసే ముందు సంపూర్ణ స్పష్టతతో తమ AI పరిసరాలను ప్రణాళిక చేసుకోవచ్చు, కొలవవచ్చు మరియు బడ్జెట్ చేసుకోవచ్చు.

పరిశోధనా ప్రయోగశాలలో ఒకటి ఒక సర్వీస్ ప్లాట్ఫార్మ్ గా ఈఎస్‎డిఎస్ యొక్క జిపియూ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ఒక 50-బిలియన్-పరామితి మోడల్ యొక్క శిక్షణను 40 రోజులు సాగేలా చేసి కార్యకలాపాల ఖర్చులను పెంచిన విడివిడిగా ఉన్న మౌలికసదుపాయాలతో సంస్థలు వ్యవహరించలేకపోయాయి. ఆప్టిమైజ్ చేయబడిన కంటెయినర్స్, అధిక-వేగము NVలింక్ బ్యాండ్‎విడ్త్ మరియు నిర్వహించబడే MLOpల ఆసరాతో NVL72-ఆధారిత జిపియూ ర్యాక్ స్కేల్ మౌలికసదుపాయాలకు మారడము ద్వారా, ప్రయోగశాల శిక్షణ సమయాన్ని కేవలం 10 రోజులకు మరియు ఖర్చులను 60 శాతానికి తగ్గింది మరియు 4x చిన్న పునరావృత సైకిల్స్ తో 30x వేగవంతమైన అనుమితిని సాధింఇంది. ఈ విజయము గణనీయమైన ప్రదర్శనను అందించుటకు ఈఎస్‎డిఎస్ యొక్క AI-కేంద్రక మౌలికసదుపాయాల వాస్తవ-ప్రపంచ సామర్థ్యాన్ని నొక్కిచెప్తుంది.

ప్రపంచ AI పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉండే మౌలికసదుపాయాలకు ఈఎస్‎డిఎస్ ప్రాధాన్యత ఇస్తుంది, అయినప్పటికీ అది భారతదేశంలో ఊహించబడింది, నిర్మించబడింది మరియు ఆప్టిమైజ్ చేయబడింది. సంస్థలు, బిఎఫ్‎ఎస్‎ఐ మరియు ప్రభుత్వ రంగాలలో 1,300 క్లయింట్స్ విశ్వసించే ఈఎస్‎డిఎస్ పారదర్శకమైన ధర, అనువైన వినియోగ నమూనాలు, డీప్ సమ్మతి సామర్థ్యాలు మరియు నిర్వహించబడే సర్వీసెస్, సురక్షత, SaaS, PaaS మరియు విభజన పద్ధతులను ఏకీకృతం చేసే ఒక యూనిఫైడ్ క్లౌడ్ సర్వీసెస్ లేయర్ లను అందిస్తుంది. సాంకేతిక ఆవిష్కరణలను కార్యకలాపాల ఉత్కృష్టతలతో కలపడం ద్వారా, సంస్థలు నమ్మకము, తక్కువ ఖర్చు మరియు సంస్థ-స్థాయి విశ్వసనీయతతో AI వ్యవస్థలను నిర్మించడము, శిక్షణ ఇవ్వడము మరియు స్కేల్ చేయడానికి వీలుకలిగించడం ఈఎస్‎డిఎస్ లక్ష్యము.

ఇది సంస్థలు పరివర్తనాత్మక AI సామర్థ్యాలను వెలికితీయగలిగేది, ఫలితాలకు-సమయాన్ని తగ్గించేది మరియు వాస్తవ-ప్రపంచ విస్తరణ నైపుణ్యము నుండి నిర్మించబడిన మౌలికసదుపాయాలపై పనిచేసేది అయిన ఒక కొత్త తరానికి ప్రారంభాన్ని సూచిస్తుంది. తన AI మౌలికసదుపాయాల నిపుణులతో కలిసి పనిచేయాలని మరియు అధిక-పనితీరు జిపియూ పరిసరాలు AI-ఆధారిత పరివర్తనలో వారి తదుపరి అడుగు ఎలా శక్తిని ఇస్తుందనేది కనుగొనాలని సంస్థలు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలను ఈఎస్‎డిఎస్ ఆహ్వానిస్తోంది

Next Story