కొత్త కాంపైన్ ను ప్రారంభించిన డెట్టాల్
డెట్టాల్, భారతదేశంలో క్రిముల నుండి రక్షించే ప్రముఖ బ్రాండ్, తన సాటిలేని రక్షణను ప్రధానాంశంగా తెలియచేస్తూనే కుటుంబాలతో బ్రాండ్ కు గల సంబంధాన్ని శక్తివంతం చేసే ఉద్వేగభరితమైన కథనంతో తమ దిగ్గజ డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ కోసం హృదయాన్ని తాకే కొత్త కాంపైన్ ను ప్రారంభించింది.
By - న్యూస్‌మీటర్ తెలుగు |
డెట్టాల్, భారతదేశంలో క్రిముల నుండి రక్షించే ప్రముఖ బ్రాండ్, తన సాటిలేని రక్షణను ప్రధానాంశంగా తెలియచేస్తూనే కుటుంబాలతో బ్రాండ్ కు గల సంబంధాన్ని శక్తివంతం చేసే ఉద్వేగభరితమైన కథనంతో తమ దిగ్గజ డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ కోసం హృదయాన్ని తాకే కొత్త కాంపైన్ ను ప్రారంభించింది. తల్లి యొక్క సహజమైన సంరక్షమ యొక్క విశ్వజననీయమైన వాస్తవంపై రూపొందించబడిన, ఈ కాంపైన్ ఈ ఆలోచనను నిజం చేసింది: “అమ్మ & డెట్టాల్ వంటి రక్షణను ఏదీ ఇవ్వదు.”
ఎన్నో తరాలుగా, డెట్టాల్ ఒక ఉత్పత్తి కంటే ఎక్కువగానే ఉంది, హానికి గురయ్యే సందర్భాల్లో ఇది భరోసాను ఇచ్చే ఉనికిగా నిలిచింది. ఈ కొత్త ఫిల్మ్ ఈ ఉద్వేగభరితమైన సారాంశాన్ని వివాహం జరుగుతున్న ఇంటిలోని ఉత్సాహవంతమైన గందరగోళంలో ఏర్పాటు చేయబడిన ఒక సున్నితమైన క్షణం ద్వారా తెలియచేయబడింది. సంబరాల మధ్యలో, ఒక చిన్నారి గాయపడ్డాడు మరియు అతను ఇతరులకు కనిపించకుండా తన గాయం దాచాడు, ముఖంలో ధైర్యం ప్రదర్శించాడు. అయితే అతను తన అమ్మను చేరుకున్న వెంటనే, ఆమె ఏదో తప్పు జరిగిందని సహజంగానే గ్రహించింది. ఆమె డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ తో అతని గాయానికి చికిత్స చేస్తుండగా, అతను తన సిగ్గును వదిలి, బాధను వ్యక్తం చేసాడు. అయితే వెంటనే అక్కడ హృదయాన్ని తాకే పాత్రల మార్పు జరిగింది. అక్కడ అతనే ఆమెను ఓదార్చాడు.
ఈ ఫిల్మ్ ఈ సందేశంతో ముగిసింది: “తమ వారి రక్షణ యొక్క శక్తివంతమైన మద్దతు.” ఇది భారతదేశపు ఇళ్లల్లో డెట్టాల్ యొక్క శాశ్వతమైన స్థానాన్ని పునరుద్ఘాటిస్తోంది, ప్రేమ సహజంగా కలిగి, రక్షణకు భరోసా కలిగించే సందర్భాల్లో అమ్మల చెంత నిలబడుతోంది.
ప్రసూన్ జోషి రచించిన కథనం మరియు భావనకు, విశాల్ ఖురానా కే నేపధ్య సంగీతం సమకూర్చారు, జావేద్ అలీ గానం చేయగా, ప్రసూన్ జోషి సాహిత్యం అందించారు, అమిత్ శర్మ దర్శకత్వంవహించిన ఈ ఫిల్మ్ భావోద్వేగం, సంస్కృతి మరియు వాస్తవికతల మిశ్రమంతో తయారైంది.
ఫిల్మ్ ప్రారంభోత్సవం గురించి వ్యాఖ్యానిస్తూ, గౌరవ్ జైన్, ఇవిపి రీజనల్ డైరెక్టర్, రెకిట్- దక్షిణాసియా, ఇలా అన్నారు, “మా బాధ్యత ఉత్పత్తులను అందించడం కంటే అధికంగా ఉంది- ప్రజలు సురక్షితమైన భావనను పొంది, రక్షించబడి మరియు పరస్పరం ఒకరికి మరొకరు సంరక్షణవహించగలిగే సామర్థ్యం కలిగి ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి మేము ఇక్కడ ఉన్నాము అని రెకిట్ లో, మేము విశ్వసిస్తాం. డెట్టాల్ ఈ మిషన్ యొక్క ప్రధానమైన భాగంలో నిలిచింది. దీని వారసత్వం ఎన్నో తరాలు విస్తరించింది, భారతదేశం అంతటా నిశ్యబ్దంగా, స్థిరంగా సహచరిగా మారుతోంది. ఇది అవసరమైన క్షణాల్లో మాత్రమే కాకుండా ఉద్వేగభరితమైన సందర్భాల్లో కూడా అంటే అమ్మ సహజమైన ఉద్వేగం బాధ్యతవహించినప్పుడు, చిన్నారి కన్నీళ్లు అతని ధైర్యం వెనక దాగినప్పుడు, రక్షణ అనేది శారీరకం మరియు లోతైన వ్యక్తిగతం అయినప్పుడు కూడా డెట్టాల్ చెంత నిలుస్తుంది. ఈ కాంపైన్ సున్నితమైన, మానవత్వంతో కూడిన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది: మాట్లాడటానికి ముందే అమ్మ గాయం గురించి గ్రహిస్తుంది, మరియు ఆమె సంరక్షణ మరియు ఆత్మవిశ్వాసంతో ప్రతిస్పందించే ఆమె సామర్థ్యాన్ని డెట్టాల్ శక్తివంతం చేస్తుంది. మొత్తంగా, అమ్మ సహజమైన స్వభావం మరియు డెట్టాల్ యొక్క రక్షణలు కలిసి ఎన్నో తరాలు విశ్వసించిన బంధాన్ని సృష్టిస్తాయి మరియు రాబోయే సంవత్సరాల కోసం నమ్మకాన్ని కొనసాగిస్తాయి.”
ప్రసూన్ జోషి, ఛైర్మన్, ఓమ్నికామ్ ఇండియా, ఇలా అన్నారు, “ఈ సాధారణమైన, కథనం చెప్పే బ్రాండ్ సమాచారం రాయడం నాకు ఆనందం కలిగించింది. డెట్టాల్ సంరక్షణ మరియు రక్షణ కోసం ఎల్లప్పుడూ నిలిచింది. ఎందుకంటే ఒక చిన్నారి గాయపడినప్పుడు, అది పెద్దది కావచ్చు లేదా చిన్నది కావచ్చు, తమ అమ్మ వద్దకు వెళ్లడమే చిన్నారులకు కలిగే మొదటి సహజమైన భావన, వారి యొక్క అంతిమమైన సురక్షితమైన స్థలం. ఆ సందర్భంలో, అమ్మ డెట్టాల్ ను తీసుకుంది, అత్యంత ముఖ్యమైన వాటిని రక్షించడానికి ఆమె విశ్వసించేది. మేము ఈ రకమైన బంధం నిజం చేయాలని కోరుకుంటున్నాం. నిశ్యబద్దమైన సంరక్షణ, సహజమైన ప్రేమ, మరియు స్థిరమైన నమ్మకం, మనం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయలేని విషయం వంటి బంధం ఇది. రెకిట్ లో, మరియు క్రోమ్ లో, నిబద్ధతతో కూడిన టీమ్, అమిత్ శర్మ యొక్క సున్నితమైన దర్శకత్వంలో, విశాల్ ఖురానా కే మరియు జావేద్ అలీలు కూర్చిన సంగీతం, ప్రదర్శనలు లేకుండా ఇది సాధ్యం కాదు.”
డెట్టాల్ ఉత్పత్తుల శ్రేణికి కీలకమైన భాగంగా నిలిచిన డెట్టాల్ యాంటీసెప్టిక్ లిక్విడ్ గాయాలు, కోతలకు సాటిలేని రక్షణను అందించడం కొనసాగిస్తున్న కారణంగా, ఎన్నో తరాల్లో కుటుంబాలకు రక్షణ కలిగించడంలో తన బాధ్యతను మరింత శక్తివంతం చేసుకుంటోంది.
ఈ కాంపైన్ ద్వారా, డెట్టాల్ భారతదేశ కుటుంబాల్లో తన సుస్థిరమైన స్థానాన్ని పునరుద్ఘాటించింది, సంరక్షణ సహజంగా మరియు రక్షణ సాటిలేనిదిగా ఉండే జీవితంలోని అత్యంత సున్నితమైన సందర్భాల్లో అమ్మలకు సన్నిహితంగా నిలుస్తోంది.