చాలా బిజీగా గడిపిన తర్వాత ‘చిల్ ఎట్ హోమ్’కి ఒక చమత్కారాన్ని పరిచయం చేసిన స్ప్రైట్ వేదాంగ్ రైనా తో క్యాంపెయిన్
ఐకానిక్ లెమన్ మరియు లైమ్ ఫ్లేవర్ పానీయం అయిన స్ప్రైట్ తనకొత్త చమత్కార మైన ప్రచారంతో రోజు చివరిలో
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Aug 2024 5:30 PM ISTఐకానిక్ లెమన్ మరియు లైమ్ ఫ్లేవర్ పానీయం అయిన స్ప్రైట్ తనకొత్త చమత్కార మైన ప్రచారంతో రోజు చివరిలో ‘ఇంట్లో చల్లగా’ ఉండటానికి సరికొత్త దృక్పథాన్ని అందిస్తుంది. యుక్త వయస్కులు తమ దైనందిన జీవితంలో తక్కువ సమయంలోనే వారి అనుభవాలను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తు న్నారు. ఆఫీస్ / కాలేజ్ పనులు, ఇతర పనులను బ్యాలెన్స్ చేసుకోవడం, పాఠ్యేతర కార్యకలాపాలు, సామాజిక అంచనాలు మరియు వ్యక్తిగత లక్ష్యాలు అధికంగా ఉంటాయి. ఇతరుల అంచనాలకు అనుగుణంగా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రోజు గడుపుతారు. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పటికి, వారు తమ బ్యాక్‌ప్యాక్‌లో ఈ అంశాలన్నిటినీ తీసుకువెళతారు. జీవితంలో ఉండే అంతం లేని హడావిడి నేపథ్యంలో ప్రశాంతంగా ఉండే, రిఫ్రెష్ అయ్యే క్షణాలను కనుగొనడం యువతరానికి చాలా కీలకమైనది. ఈ అవసరాన్ని గుర్తించి, స్ప్రైట్ పరిపూర్ణ చిల్ భాగస్వామిగా అడుగుపెట్టింది, చాలా రోజుల తర్వాత టీనేజ్ వాళ్లు విశ్రాంతి తీసుకోవడానికి రిఫ్రెష్ ట్విస్ట్‌ను అందిస్తోంది.
వర్ధమాన తార వేదాంగ్ రైనా నటించిన ఈ ప్రచార కార్యక్రమం రోజంతా బాగా పని చేసిన తరువాత చివరిలో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా నవతరానికి సూచిస్తుంది; దైనందిన జీవితంలో భాగంగా అనివార్యమైన, బాధించే క్షణాలను ఎదుర్కొ న్నప్పుడు స్ప్రైట్‌ను ఎంపిక చేసుకునే పానీయంగా అందజేస్తుంది. టీనేజ్ జీవితం వారి కళా శాల జీవితం, సామాజిక బృందాలు, స్నేహితుల సమూహాలు, ఒత్తిళ్లు మొదలైన వాటితో ప్రతిధ్వనించే చిత్రాల శ్రేణిగా ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించబడింది. బ్యాగ్‌ల నుండి బయటకు వచ్చే వ్యక్తులు, రిఫ్రిజిరేటర్లు సంభా షించడం, వినోదాత్మక మార్పిడి – అన్నీ కూడా ఈ ప్రచార కార్యక్రమం యొక్క తెలివైన హాస్యానికి దోహదం చేస్తా యి. యుక్తవయస్కులకు అత్యంత ముఖ్యమైన క్షణాలను మిళితం చేస్తూ సరైన సందర్భం & సరైన సమ యాన్ని అందించేలా రూపొందించబడిన 200 ప్రత్యేకమైన సందేశాలను అందించడానికి ఈ ప్రచారం ఏఐని కూడా అనుసంధానిస్తుంది.
రైజింగ్ స్టార్, జెన్ జెడ్ ఐకాన్ వేదాంగ్ రైనా ఈ ప్రచార కార్యక్రమం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, “నేను స్ప్రైట్ ప్రపంచంలో భాగమైనందుకు థ్రిల్‌గా ఉన్నాను. నేటి యువత యొక్క చల్లని, శక్తివంతమైన శక్తితో ప్రతి ధ్వనించేటటువంటి ఐకానిక్ బ్రాండ్‌తో పనిచేయడం ఒక ఉత్తేజకరమైన అవకాశం. స్ప్రైట్ దృక్పథంతో నేను పూర్తి గా ఏకీభవిస్తాను. నాతో సహా మా తరానికి రోజు ముగింపు చాలా కీలకం. చల్లని, చమత్కారమైన స్ప్రైట్ ను తీసుకోవడం ఎల్లప్పుడూ గందరగోళంలో ప్రశాంతతను కలిగిస్తుంది" అని అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమం గురించి కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఏషియా స్పార్క్లింగ్ ఫ్లేవర్స్ సీనియర్ కేటగిరీ డైరెక్టర్ సుమేలీ ఛటర్జీ మాట్లాడుతూ, "ప్రతి రోజూ మరింత సాధించడానికి రోజంతా ఢక్కామొక్కీలు తింటూ ఉంటారు. రోజు చివరిలో, ప్రతి టీనేజర్ కూడా ఆహ్లాదం కోరుకుంటారు. కానీ వారు రోజు చివర్లో సామాను, ఒత్తిడితో కూడిన బ్యాగ్‌తో తమ ఇళ్లలోకి వెళతారు. స్ప్రైట్ చమత్కారాన్ని సూచించడానికి ఈ బ్యాగ్‌ని ఉపయోగిస్తుంది ఈ క్రియేటివ్. రోజంతా కష్టపడిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి టీనేజర్లను ప్రోత్సహిస్తుంది రిఫ్రెష్ పానీయం. వేదాంత్ చల్లని ప్రకంపనలను అందిస్తారు, అది నేటి యుక్తవయస్కులతో ప్రతిధ్వనించేలా చేస్తుంది’’ అని అన్నారు.
కార్కోయిస్ ఫిల్మ్స్ డైరెక్టర్ విశ్వేష్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, “నేటి డిజిటల్ యుగంలో, రోజు నిజంగా ముగియదు. ప్రతి ఒక్కరూ మీ ఫోన్‌లో, మీ బ్యాగ్‌లో, మీ తలలో ఉంటూ ఇంటికి తిరిగి మిమ్మల్ని అనుసరిస్తారు. ఇది చిత్రానికి గొప్ప విజువల్ డివైజ్ ను అందిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులను బ్యాక్ ప్యాక్ నుండి బయటకు వచ్చేలా చేయడం ఒక సరదా సవాలు! స్ప్రైట్‌లోని ప్రపంచం ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో నిండి ఉంటుంది - మాట్లాడే ఫ్రిజ్ లు, బ్యాక్‌ప్యాక్‌ల నుండి దూకుతున్న వ్యక్తులు మరియు గది చుట్టూ జూమ్ చేస్తున్న స్ప్రైట్ బాటిళ్లు. ఇది ప్రత్యేకమైనది మరియు వినోదాత్మకమైనది’’ అని అన్నారు.
ఓగిల్వీ ఇండియా (నార్త్) చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రీతు శారదా మాట్లాడుతూ, “స్ప్రైట్ ఎప్పుడూ యువత నాడిని అర్థం చేసుకుంటుంది. బ్యాక్‌ప్యాక్ బరువు అనేది కాలేజీ విద్యార్థులు ఎదుర్కొనే రోజువారీ చికాకులకు ప్రతీకగా ఈ చిత్రం సంగ్రహిస్తుం ది. ఇది రోజంతా వారు మోస్తున్న ఒత్తిడి మరియు భారాలను సూచిస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి సరైన మార్గం గా స్ప్రైట్ అడుగు పెడుతుంది, రోజులో ముగింపు క్షణాలను నిజంగా రిఫ్రెష్ మరియు రివార్డింగ్‌గా మారుస్తుంది" అని అన్నారు.
స్ప్రైట్ భారతదేశం అంతటా యుక్తవయస్కులను వారి బిజీ జీవితాల నుండి విశ్రాంతి తీసుకోవడానికి మరియు స్ప్రైట్ రిఫ్రెష్ బాటిల్‌తో ‘చిల్ ఎట్ హోమ్’ కోసం ఆహ్వానిస్తుంది. రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు పెరిగేకొద్దీ, విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం మరింత అవసరం. మీరు చాలా రోజుల తర్వాత చల్లబడుతున్నా లేదా ప్రశాంతమైన క్షణంలో ఆనందిస్తున్నా, స్ప్రైట్ యొక్క క్రిస్ప్ లెమన్ – లైమ్ రుచి అంతిమ రిఫ్రెష్‌మెంట్‌ను అందిస్తుంది. కాబట్టి, హాయిగా విశ్రాంతి తీసుకోండి మరియు ఇంట్లో మీ చల్లదనాన్ని కనుగొనడంలో స్ప్రైట్ మీకు సహాయం చేయనివ్వండి.