“బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్”: ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని పిలుపు

వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ MS ధోని “బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్” అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 23 March 2026 5:19 PM IST

“బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్”: ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని పిలుపు

వాపిలోని మెరిల్ వారి గ్లోబల్ హెడ్ క్వార్టర్ కు తాను మొదటి సారిగా వెళ్ళినప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ MS ధోని “బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్” అనే విషయంలో హృదయపూర్వకంగా స్ఫూర్తిదాయకమైన చక్కని సంభాషణలో పాల్గొన్నారు. “బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్” అనేది మెరిల్ వారు ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ఒక ప్రజారోగ్య ప్రచారం, “ట్రీట్‌మెంట్ జరూరి హై” అనే నినాదంతో ఈ ప్రచారం రూపొందించబడింది, సరైన సమయంలో రోగ నిర్ధారణ మరియు అధునాతనమైన వైద్య చికిత్సల అందుబాటును గురించి ప్రజలకు సరైన అవగాహన కలిగిస్తూ ఈ నినాదం ముందుకు సాగుతోంది.

భారీ స్థాయిలో సాగుతున్న ఈ ప్రచార హోరు ఎంతగానో విస్తరిస్తూ, “బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్” ట్రీట్‌మెంట్ జరూరి హై నినాదాల గొడుగు నీడలో వృద్దుల ఆరోగ్య విషయంలో ఒక అంకిత భావంతో ముందుకు సాగుతోంది. సమస్యను ముందుగా గుర్తించడం, నివారణ పద్దతులు మరియు అందుబాటులో ఉన్న వివిధరకాల చికిత్సా విధానాలు, గుండె, ఆర్థోపెడిక్ మరియు ఇతర వృద్ధాప్య సంబంధిత సమస్యలకు, మంచి ఫలితాలతో – వారి స్వేచ్చను, జీవన విధానాన్ని కాపాడుతుందని, రాబోయే సంవత్సరాలు వారికి స్వర్ణమయం అవుతాయనే వివరణ ఈ కాంపెయిన్ కు మరింత బలం చేకూరుస్తోంది. ఈ ప్రచారం వృద్దులలో ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిస్తోంది - వయస్సు పెరుగుతున్నప్పటికీ, వారిలోని ఉత్సాహం, ఉల్లాసం, మరియు వారి ఆనందాల స్ఫూర్తి ఎప్పటికీ తగ్గకూడదు. జీవితంలోని ప్రతి దశలోనూ వారి గౌరవాన్ని, ఉత్సాహాన్ని కాపాడుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను ఈ సంభాషణ హైలైట్ చేసింది, ముఖ్యంగా భారతదేశంలోని వృద్ధుల జీవన విధానాలకి సంబంధించిన విషయాలలో గొప్ప మార్పులు కలుగుతున్నాయి.

ఈ కాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం గురించి మాట్లాడుతూ MS ధోని ఇలా అన్నారు. “మీ కోసం, మీరు కావాలనుకునే వారి కోసం - మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీరు చేయగలిగే అతి ముఖ్యమైన పనులలో ఒకటి, అని నేను ఎల్లప్పుడూ నమ్ముతాను, మన తల్లిదండ్రులకు, తాత, నానమ్మలకు కావలసిన సరైన సంరక్షణను అందిస్తూ, వారిని శ్రద్ధగా చూసుకోవడం మనందరి, ముఖ్యంగా యువతరానికి ఉన్న పెద్ద బాధ్యత. ఆ దిశలో ముందడుగు వేస్తున్న ‘ట్రీట్‌మెంట్ జరూరి హై’ వంటి కార్యక్రమాలు, ఇక నేను ఇందులో ఒక భాగం కావడం నాకెంతో ఆనందంగా ఉంది”

కుటుంబాల కోసం ఒక జాతీయ ఉద్యమం

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో దేశవ్యాప్త ఉద్యమంగా తలపెట్టిన ఈ కాంపెయిన్, యువ భారతీయులు - చిన్ననాటి సరదా ఆటలను గుర్తుచేసుకుంటూ, వారి ఇష్టాలను తెలియజేస్తూ, తమ తాత, నానమ్మలతో ఆనందకరమైన సమయాన్ని గడిపిన, ఆ ఆనందకరమైన క్షణాలని తిరిగి వారి ముందుకు తేవాలని ప్రోత్సహిస్తోంది. భావోద్వేగ సంబంధాలతో నివారణ, ఆరోగ్య సంరక్షణ గురించిన అవగాహన కలిగిస్తూ, ఈ భావోద్వేగ ఆనందం మరియు శారీరక ఆరోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.

ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని గొప్పగా ప్రభావితం చేసే జీవన విధానాల సంబంధిత ఆరోగ్య పరిస్థితులకు భారతదేశం సాక్షిగా నిలుస్తోంది. భారతదేశంలో జరిగే మరణాలలో దాదాపు 28% గుండె సంబంధిత వ్యాధులేనని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరియు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం తెలుస్తోంది, మనదేశంలోని మరణాలకు ఇవే ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. అలాగే, మారుతున్న జీవన విధానాలు, తగ్గిన శారీరక శ్రమ ఊబకాయాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) నివేదన ప్రకారం భారతదేశంలోని పెద్దలలో 24% కంటే ఎక్కువ మంది ఇప్పుడు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ కారణాలతో వారు కదలలేని, నడవలేని పరిస్థితులు పెరుగుతున్నాయి - ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ మరియు NIH పరిశోధన డేటాబేస్‌లలో ప్రచురించబడిన అధ్యయనాలు భారతదేశంలోని ప్రతి నలుగురి (4) పెద్దవారిలో ఒకరికి (1) మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నాయి, నడవలేకపోవడానికి ఇది ప్రధాన కారణంగా మారి, ఇప్పుడు దేశంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు తప్పనిసరి అయినాయి. ముందుగా డాక్టర్ ను సంప్రదించి, నివారణ పరీక్షలు చేయించుకుని, ఆరోగ్యకరమైన, మరింత ఎక్కువ ఆయుర్దాయం కలిగేలా చూసుకోవడానికి అధునాతన చికిత్సల అందుబాటు పెరుగుతున్న అవసరాలని ఈ కారణాలు అన్నీ హైలైట్ చేస్తున్నాయి.

ఈ కాంపెయిన్ ‘ట్రీట్‌మెంట్ జరూరి హై’ ప్లాట్‌ఫామ్‌లు మరియు మెరిల్ వారి అధికారిక మీడియా హ్యాండిల్స్‌లో విస్తరించబడుతోంది, దేశంలో ప్రతి ఒక్కరికీ చేరే విధంగా నిర్ధారించడానికి ప్రింట్, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తరించి, అనేక-ఛానళ్ళ ద్వారా అందరికీ చేరువ అవుతోంది. లక్ష్యంగా చేసుకున్న డిజిటల్ వ్యూయర్‌షిప్ మైలురాళ్ళు, కొలవగల సరైన కొలమానాలు, క్యూరేటెడ్ వీడియో బైట్‌లు మరియు నిపుణుల నేతృత్వంలోని సంభాషణలతో వ్యూహాత్మక KOL భాగస్వామ్యంతో, ఈ ప్రచారం వృద్దుల ఆరోగ్యం మరియు వృద్ధాప్యంలో చురుకైన జీవనానికి స్థిరమైన, సంభాషణ విశ్లేషణలను ప్రేరేపించే దిశగా ముందుకు సాగుతోంది.

భారతదేశంలోని జనాభా క్రమంగా వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నప్పుడు, ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం గురించి మాట్లాడటం అనేది చాలా ముఖ్యంగా మారుతోంది. “బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్” అనేది వృద్ధాప్యం అంటే ఉత్సాహ భరితమైన జీవితం నుండి వైదొలగడం కాదని, ఆ స్ఫూర్తిని కాపాడుకోవడానికి - సరైన సమయంలో ఆరోగ్య సంరక్షణ గురించిన సరైన అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేస్తుంది.

మన దేశంలో ఉన్న కుటుంబాలు తమ కథలను వివరించడం - చిన్న వీడియోలను రికార్డ్ చేయడం, హృదయపూర్వక ప్రశంసలను పోస్ట్ చేయడం లేదా వారి తాత, నానమ్మలతో మధురమైన జ్ఞాపకాలను స్వంతం చేసుకోవడం వంటివి చేయాలని ఈ ప్రచారం పిలుపునిస్తోంది. ‘ట్రీట్‌మెంట్ జరూరి హై’ ప్లాట్‌ఫామ్‌లు, ప్రచార సందేశాలతో సోషల్ మీడియాలో వారి అనుభవాలను అందరితో పంచుకుంటూ, వృద్దుల ఆరోగ్యం, ఆదరణ మరియు ఐక్యతను సమర్ధించే విధంగా వ్యక్తిగత జ్ఞాపకాలను ఒక సమిష్టి జాతీయ కథనంగా మార్చాలి.

Next Story