Video: 'నేనెందుకు హిందీలో మాట్లాడాలి?'.. మహిళా ప్రయాణికులతో ఆటో డ్రైవర్‌ వాగ్వాదం

ఓ విసుగు చెందిన ఆటోరిక్షా డ్రైవర్ తనను హిందీలో మాట్లాడమని అడిగిన మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు.

By అంజి  Published on  12 March 2023 12:38 PM IST
autorickshaw driver,Bengaluru,Hindi imposition,Kannada

మహిళా ప్రయాణికులతో ఆటో డ్రైవర్‌ వాగ్వాదం

ఓ విసుగు చెందిన ఆటోరిక్షా డ్రైవర్ తనను హిందీలో మాట్లాడమని అడిగిన మహిళా ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. బెంగుళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా వీక్షణలతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రయాణికుల డిమాండ్లకు తలొగ్గని ఆటోరిక్షా డ్రైవర్‌ను పలువురు నెటిజన్లు అభినందించారు. అయితే ఈ వాదనకు దారి తీసిన విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

ఆటోరిక్షా డ్రైవర్‌ మహిళా ప్రయాణికులతో ''ఇది కర్ణాటక, మీరు కన్నడలో మాట్లాడాలి'' అని చెప్పడంతో వీడియో ప్రారంభమవుతుంది. మీరు ఉత్తర భారత యాచకులు, మీరు కర్ణాటకకు ఎందుకు వచ్చారు? అంటూ డ్రైవర్‌ ప్రశ్నించాడు. అతను మాట్లాడుతున్నప్పుడు.. ప్రయాణీకులలో ఒకరు ''లేదు, మేము కన్నడ మాట్లాడము, కన్నడలో ఎందుకు మాట్లాడాలి?'' అని అన్నారు. ఆటోరిక్షా డ్రైవర్ చిరాకుపడి తన వాహనాన్ని ఆపి.. ''ఇది మా భూమి, మీ భూమి కాదు. నేను హిందీలో ఎందుకు మాట్లాడాలి?'' అంటూ ప్రశ్నించాడు. ఇది ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుందని గ్రహించిన మహిళా ప్రయాణికులు కిందకు దిగి పరిస్థితిని శాంతింపజేయడానికి "సరే" అని చెప్పారు. దాంతో వీడియో ముగుస్తుంది.

ఇటీవల కర్ణాటకకు చెందిన పాన్ ఇండియా నటుడు ప్రకాష్ రాజ్.. ''నాంగే హిందీ బరల్లా, హోగప్పా'' అని రాసి ఉన్న టీ-షర్టును ధరించాడు. దాని అర్ధం ''నాకు హిందీ రాదు, వెళ్ళు!'' అని. ఆ తర్వాత ప్రకాష్‌ రాజ్‌ నెటిజన్ల నుండి చాలా విమర్శలను అందుకున్నాడు. వారు దీనిని హిందీకి "అవమానం" అని పేర్కొన్నారు. ఒక సుప్రీంకోర్టు న్యాయవాది టీ-షర్ట్‌లోని నటుడి ఫోటోను షేర్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌ను డిమాండ్ చేస్తూ తమిళనాడు పోలీసులను ట్యాగ్ చేశారు. ''నా మూలాలు..నా మాతృభాష కన్నడ.. మీరు ఆమెను అగౌరవపరిచి, మీ భాషను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తే.. మేము ఇలాగే నిరసన తెలుపుతాము'' అని ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Next Story